Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mufasa-the-lion-king-80180b0e-0b5c-4ed0-aabe-2872311ff2d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mufasa-the-lion-king-80180b0e-0b5c-4ed0-aabe-2872311ff2d8-415x250-IndiaHerald.jpgఅడ్వెంచర్ మూవీస్ అంటే చాలా మందికి ఇష్టం. ఎక్కువ మంది హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ చూసి తెగ ఎంజాచ్ చేస్తుంటారు. ఆ కోవకు చెందిన మూవీనే లయన్ కింగ్. 1994లో విడుదలైన ఈ మూవీ ఆ రోజుల్లో భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ మూవీకి సీక్వెల్ రానుంది. ముఫాసా అనే పేరుతో ఆ మూవీని తెరకెక్కిస్తున్నారు. ముఫాసా లయన్ కింగ్‌గా మారిన విధానాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు. యాక్షన్, ఎమోషన్స్‌తో పాటుగా అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను బారీ జెంకిన్స్ రూపొందిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 20వ తేదిన వరల్డ్ Mufasa: The Lion King {#}Nani;aryan;Rajani kanth;Hollywood;December;lion;Yuva;Lion;Telugu;Cinemaతన ఫ్యామిలీతో డబ్బింగ్ చెప్పించి క్రేజ్‌ను సొంతం చేసుకున్న సూప‌ర్ స్టార్..!తన ఫ్యామిలీతో డబ్బింగ్ చెప్పించి క్రేజ్‌ను సొంతం చేసుకున్న సూప‌ర్ స్టార్..!Mufasa: The Lion King {#}Nani;aryan;Rajani kanth;Hollywood;December;lion;Yuva;Lion;Telugu;CinemaTue, 13 Aug 2024 08:10:00 GMTఅడ్వెంచర్ మూవీస్ అంటే చాలా మందికి ఇష్టం. ఎక్కువ మంది హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ చూసి తెగ ఎంజాచ్ చేస్తుంటారు. ఆ కోవకు చెందిన మూవీనే లయన్ కింగ్. 1994లో విడుదలైన ఈ మూవీ ఆ రోజుల్లో భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ మూవీకి సీక్వెల్ రానుంది. ముఫాసా అనే పేరుతో ఆ మూవీని తెరకెక్కిస్తున్నారు. ముఫాసా లయన్ కింగ్‌గా మారిన విధానాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు. యాక్షన్, ఎమోషన్స్‌తో పాటుగా అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను బారీ జెంకిన్స్ రూపొందిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 20వ తేదిన వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇండియాలో భారీ ఎత్తున ముఫాసా మూవీ విడుదల కానుంది. హిందీతో పాటుగా తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ హిందీ డబ్బింగ్ బాధ్యతలను షారుక్ ఖాన్ తీసుకున్నారు. తనతో పాటుగా తన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రమ్ ఖాన్‌లతో ఆయన డబ్బింగ్  చెప్పించారట. సింబ పాత్రకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెబితే యువ ముఫాసా పాత్రకు అబ్రమ్ ఖాన్ వాయిస్ అందించారట. ఇక ముఫాసా పాత్రకు షారుఖ్ తన గాత్రాన్ని దానం చేశారట. ఫ్యామిలీతో ఇలా సూపర్ స్టార్ డబ్బింగ్ చెప్పించడం పట్ల ఈ మూవీకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఈ మధ్యనే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్  వచ్చింది. యూట్యూబ్‌లో అయితే రికార్డు వ్యూస్ వచ్చాయి. ముఫాసా పాత్ర గురించి షారుఖ్ చెబుతూ ఆ పాత్రకు బాగా కనెక్ట్ అయినట్లు తెలిపారు. ముఫాసా చిన్నతనం నుంచి రాజుగా ఎదగడం అద్భుతంగా ఉందని చెప్పారు. డిస్నీతో తనకున్న ప్రత్యేక అనుబంధం వల్ల తనతో పాటు తన కుమారులను కూడా ఈ మూవీ డబ్బింగ్‌లో భాగం చేశానని షారుఖ్ చెప్పుకొచ్చారు. ఇక తెలుగులో అయితే లయన్ కింగ్ మూవీలో సింబా పాత్రకు నేచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెప్పారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>