PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/news-channela-central-government246f1b34-a118-4fce-abed-346f2abb073f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/news-channela-central-government246f1b34-a118-4fce-abed-346f2abb073f-415x250-IndiaHerald.jpgఎలాంటి విషయమైనా సరే ఇప్పుడు క్షణాలలో వైరల్ కావాలి అంటే మీడియా లేకపోతే సోషల్ మీడియా వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను సైతం తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అదేమిటంటే ప్రకృతి విపత్తుల ప్రమాదాలకు సంబంధించిన వార్తలు సైతం విజువల్స్ ఇక మీదట ప్రసారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మరి వ్యవహరించాలంటూ కేంద్రం స్పష్టం చేస్తోంది. ప్రమాదాలకు సంబంధించిన విజువల్స్ పైన .. జరిగిన తేదీ టైమ్ స్టాంపు కచ్చితంగా ఉండాలి అంటూ తెలియజేస్తున్నారు.NEWS CHANNELA; CENTRAL GOVERNMENT{#}prakruti;Himachal Pradesh;television;Audience;central government;Yevaru;media;Newsవైరల్: న్యూస్ ఛానల్స్ పై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక మీదట అలా చేస్తే కుదరదు..!వైరల్: న్యూస్ ఛానల్స్ పై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక మీదట అలా చేస్తే కుదరదు..!NEWS CHANNELA; CENTRAL GOVERNMENT{#}prakruti;Himachal Pradesh;television;Audience;central government;Yevaru;media;NewsTue, 13 Aug 2024 17:48:00 GMTఎలాంటి విషయమైనా సరే ఇప్పుడు క్షణాలలో వైరల్ కావాలి అంటే మీడియా లేకపోతే సోషల్ మీడియా వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను సైతం తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అదేమిటంటే ప్రకృతి విపత్తుల ప్రమాదాలకు సంబంధించిన వార్తలు సైతం విజువల్స్ ఇక మీదట ప్రసారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మరి వ్యవహరించాలంటూ కేంద్రం స్పష్టం చేస్తోంది. ప్రమాదాలకు సంబంధించిన విజువల్స్ పైన .. జరిగిన తేదీ టైమ్ స్టాంపు కచ్చితంగా ఉండాలి అంటూ తెలియజేస్తున్నారు.

ఈ సూచనలు సైతం న్యూస్ ఛానల్ కు మీడియా సంస్థలకు సైతం తప్పనిసరిగా పాటించాలంటూ హెచ్చరిస్తోంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ విషయాలను జారీ చేశారట. టెలివిజన్ చానల్స్ ప్రకృతి విపత్తులు పెద్ద ప్రమాదాలను సంబంధించి విషయాల పైన కొన్ని రోజులపాటు కవరేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సంఘటన జరిగిన రోజు చూపించిన వీడియోలు , ఫుటేజీలు సైతం ప్రతిసారి అవే చూపిస్తూ ఉండడం చేత.. వీటి పైన ఎన్నోసార్లు ఇలాంటి వాటి పైన ప్రజలు అయోమయానికి ఆందోళనకు గురయ్యారని అందుకే ఇక మీదట అలా జరగకూడదని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది.

సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ప్రసారం చేసి విజువల్స్ ని కూడా తాజావి అనుకొనే అవకాశం ప్రజలు  ఉంటుంది కనుక ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరు కూడా ఇలాంటి అపోహలకు దారి తీయకుండా ఉండేందుకు మీడియా ఛానల్స్ ని సైతం జాగ్రత్తగా ఉంటూ డేటు, టైమింగ్ తో సహా అన్ని వేయాలి అంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తర్వులను కూడా జారీ చేశారు. తేదీ సమయాన్ని చూపించడం వల్ల చూసేటువంటి ప్రేక్షకులు సైతం ఈ వీడియోల పైన కచ్చితంగా సమాచారాన్ని అందుకుంటారని.. సంఘటన స్థలంలోని వాస్తవ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నదా అని ప్రజలు కూడా తెలుసుకుంటారని తెలిపారు. అయితే ఇటీవలే జరిగిన వయనాడ్, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ప్రకృతిలో విపత్తుల వల్ల.. వచ్చిన కవరేజ్ తరువాతే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>