PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brs5e825638-1839-4db2-82cb-a40db655fc7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brs5e825638-1839-4db2-82cb-a40db655fc7f-415x250-IndiaHerald.jpgతొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను కారు ఎక్కించేసుకున్నారు. చివరకు ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలను సైతం తమ పార్టీలో చేర్చుకుని అసలు ప్రతిపక్షం అన్నది లేకుండా చేశారు. ఇక రెండోసారి కేసీఆర్ ఏకంగా 88 సీట్లతో భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది లేకుండా చేసేందుకు ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలను సైతం తbrs{#}KTR;revanth;Revanth Reddy;Ishtam;Congress;KCR;Telangana Chief Minister;Party;Car;India;Telugu Desam Party;Telanganaకారు నాలుగు టైర్ల‌కు పంక్చ‌ర్‌... ఇక బీఆర్ఎస్‌కు మిగిలే ఎమ్మెల్యేలు వీళ్లే...!కారు నాలుగు టైర్ల‌కు పంక్చ‌ర్‌... ఇక బీఆర్ఎస్‌కు మిగిలే ఎమ్మెల్యేలు వీళ్లే...!brs{#}KTR;revanth;Revanth Reddy;Ishtam;Congress;KCR;Telangana Chief Minister;Party;Car;India;Telugu Desam Party;TelanganaTue, 13 Aug 2024 09:15:41 GMT- రేవంత్ విదేశాల నుంచి వ‌చ్చిన వెంట‌నే ఆరుగురు ఎమ్మెల్యేల చేరిక‌
- గులాబీ పార్టీలో ఆ ముగ్గురే మిగులుతారా..
- కేసీఆర్ పై రేవంత్ రివేంజ్ మామూలుగా లేదే .. !

- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు వదిలేలా లేదు. పదేళ్లపాటు తెలంగాణ ను ఏక చక్రాధిపత్యంగా పరిపాలించిన కేసీఆర్ అసలు తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను కారు ఎక్కించేసుకున్నారు. చివరకు ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలను సైతం తమ పార్టీలో చేర్చుకుని అసలు ప్రతిపక్షం అన్నది లేకుండా చేశారు. ఇక రెండోసారి కేసీఆర్ ఏకంగా 88 సీట్లతో భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది లేకుండా చేసేందుకు ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలను సైతం తమ పార్టీలో చేర్చుకున్నారు.


అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ మీద అలాంటి రివెంజ్ తీర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే 10 మందికి పైగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిపోయారు. మరో ఆరు నెలలలో గులాబీ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలను హస్తం పార్టీలో చేర్చుకుని బిఆర్ఎస్ లో చివరకు హరీష్ రావు - కేటీఆర్ - కెసిఆర్ తప్ప ఎవరూ లేకుండా చేయాలన్న టార్గెట్ తోనే రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన వెంట‌నే ఆరుగురు ఎమ్మెల్యేలు హ‌స్తం గూటికి చేరుకోనున్నారు. ఇప్ప‌టికే వీరితో కాంగ్రెస్ నాయ‌కులు.. అటు రేవంత్ రెడ్డి విదేశాల నుంచే చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>