Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-video-1cb325a0-8f68-46f4-a315-cf970bbbf865-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-video-1cb325a0-8f68-46f4-a315-cf970bbbf865-415x250-IndiaHerald.jpgరీసెంట్‌గా బెంగళూరు నగరంలోని హెబ్బల్ ఫ్లైఓవర్‌పై ఓ షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియో ప్రకారం బీఎమ్‌టీసీ బస్సు రద్దీగా ఉన్న రోడ్డుపై కంట్రోల్ తప్పింది బ్రేక్ ఫెయిల్ అయినట్లుగా అది ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు బైకర్లను డీ ఢీ కొడుతూ ముందుకు వెళ్ళింది. కొన్ని కార్లకు కూడా బలంగా డ్యాష్ ఇచ్చింది. దీనివల్ల కొన్ని వాహనాలు ద్వంశమయ్యాయి బైకర్లకు గట్టిగానే దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించినట్లు లోకల్ మీడViral video {#}Cheque;bus;vehicles;Driver;Accident;local languageబ్రేక్ పెడల్ కింద వాటర్‌బాటిల్.. బస్సు ఆపడం కుదరక ఘోర యాక్సిడెంట్..?బ్రేక్ పెడల్ కింద వాటర్‌బాటిల్.. బస్సు ఆపడం కుదరక ఘోర యాక్సిడెంట్..?Viral video {#}Cheque;bus;vehicles;Driver;Accident;local languageTue, 13 Aug 2024 21:36:00 GMT

రీసెంట్‌గా బెంగళూరు నగరంలోని హెబ్బల్ ఫ్లైఓవర్‌పై ఓ షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియో ప్రకారం బీఎమ్‌టీసీ బస్సు రద్దీగా ఉన్న రోడ్డుపై కంట్రోల్ తప్పింది బ్రేక్ ఫెయిల్ అయినట్లుగా అది ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు బైకర్లను డీ ఢీ కొడుతూ ముందుకు వెళ్ళింది. కొన్ని కార్లకు కూడా బలంగా డ్యాష్ ఇచ్చింది. దీనివల్ల కొన్ని వాహనాలు ద్వంశమయ్యాయి బైకర్లకు గట్టిగానే దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించినట్లు లోకల్ మీడియా వెల్లడించింది. 

ఈ ఘోర యాక్సిడెంట్ లో ఎవరూ చనిపోకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది ఒక వోల్వో బస్సు లాగా తెలుస్తోంది. వీడియోలో బస్సు ఆగినట్లు ఆగింది ఆ తర్వాత ముందుకు దూసుకెళ్లింది. డ్రైవర్ బస్సు కంట్రోల్లో లేదు అన్నట్లుగా సైగల్ చేశాడు. పక్కనే ఉన్న మరొక డ్రైవర్ ఏం చేస్తున్నావ్ ఆపు అని తిట్టినట్లుగా కూడా కనిపించింది ఆ సమయంలో డ్రైవర్ బస్సు ఆగడం లేదు అన్నట్లుగా నిస్సహాయతగా మాట్లాడాడు. ఈ దృశ్యాలన్నీ బస్సులో అమర్చిన సిసిటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

 అయితే ఈ షాకింగ్ సంఘటన జరగడానికి కారణం ఒక వాటర్ బాటిల్ అని అనుమానిస్తున్నారు. బస్సు స్టాఫ్ లేదా ప్యాసింజర్ లో వాటర్ బాటిల్ అనేది బస్సు బ్రేక్ పెడల్ కిందకు వెళ్లి చిక్కుకున్నట్లు ఉంది బ్రేక్ వేసినా ఈ వాటర్ బాటిల్ అది పడకుండా అడ్డుకున్నట్లు ఉంది అని చాలామంది అనుమానిస్తున్నారు. బస్సు కొంచెం తక్కువ స్పీడ్ లో వెళ్లడం వల్ల ముందున్న వాహనదారులు బతికిపోయారు అదే 70-100 కిలోమీటర్ల వేగం లో బస్సు ఉన్నట్లయితే ఎవరూ బతికి ఉండేవారు కాదు. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని కొంతమంది అంటున్నారు. ఏమైనా బండిని కంట్రోల్ లో ఉంచేవి బ్రేక్స్ మాత్రమే కాబట్టి అవి సరిగా పడుతున్నాయో లేదో తరచుగా చెక్ చేస్తూ ఉండాలి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. బ్రేకులు ఫంక్షన్ కాకపోతే చనిపోయే ప్రమాదాలు ఎక్కువ. వాహనదారులు ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రేక్స్ పెడల్ కింద ఏమీ పడకుండా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. 

https://x.com/DriveSmart_IN/status/1823254208558006398?t=oiwoDTVsqWUege5-oSwwWg&s=19







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>