MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/how-long-will-the-second-part-of-kalki-adddba2291-ac46-46ea-bf08-480333c66a69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/how-long-will-the-second-part-of-kalki-adddba2291-ac46-46ea-bf08-480333c66a69-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో నాగ్ అశ్విన్ ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కల్కి సినిమాతో ఈ దర్శకుడు సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. కల్కి సినిమా సంచలన విజయం సాధించడంతో ఈ దర్శకుడి తర్వాత ప్రాజెక్టులపై అంచనాలు పెరుగుతున్నాయి. 2026 సెకండ్ హాఫ్ లో కల్కి సీక్వెల్ రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. nag ashwin{#}nagarkurnool;nag ashwin;Tollywood;vijay kumar naidu;Darsakudu;Father;School;Success;Industry;Director;Cinema;News;Reddyసొంతూరికి అండగా నిలబడ్డ నాగ్ అశ్విన్.. స్కూల్ కోసం అన్ని రూ.లక్షల సాయం చేశారా?సొంతూరికి అండగా నిలబడ్డ నాగ్ అశ్విన్.. స్కూల్ కోసం అన్ని రూ.లక్షల సాయం చేశారా?nag ashwin{#}nagarkurnool;nag ashwin;Tollywood;vijay kumar naidu;Darsakudu;Father;School;Success;Industry;Director;Cinema;News;ReddyMon, 12 Aug 2024 22:40:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో నాగ్ అశ్విన్ ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కల్కి సినిమాతో ఈ దర్శకుడు సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. కల్కి సినిమా సంచలన విజయం సాధించడంతో ఈ దర్శకుడి తర్వాత ప్రాజెక్టులపై అంచనాలు పెరుగుతున్నాయి. 2026 సెకండ్ హాఫ్ లో కల్కి సీక్వెల్ రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
 
అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా తాను చేసిన మంచి పని ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు. సొంతూరుకి మేలు జరిగేలా నాగ్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సొంతూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదులను నిర్మించడానికి నాగ్ అశ్విన్ ఏకంగా 66 లక్షల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. స్కూల్ కోసం ఏకంగా ఇంత మొత్తాన్ని ఖర్చు చేయడం సులువైన విషయం కాదు.
 
తన తండ్రి చదివిన ప్రభుత్వ పాఠశాలకు నాగ్ అశ్విన్ తనవంతు సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఈ విధంగా సొంతూరికి తమ వంతు సహాయం చేస్తే చాలా గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ సైతం తన స్వగ్రామం కోసం గతంలో లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నాగ్ అశ్విన్ సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లాలోని ఐతోల్ కాగా ఈ గ్రామంలో నాగ్ అశ్విన్ తాతయ్య సింగిరెడ్డి పర్వత రెడ్డి పేరుపై ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలకి నాగ్ అశ్విన్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
 
నాగ్ అశ్విన్ కు ఈ పాఠశాలతో ప్రత్యేక అనుబంధం ఉందని సమాచారం అందుతోంది. నాగ్ అశ్విన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ పరంగా టాప్ డైరెక్టర్ కాగా భారీ విజయం అందుకున్నా ఈ దర్శకుడిలో అణువంతైనా గర్వం లేకపోవడం కొసమెరుపు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>