PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/galla-jayadevba8d4a4d-b5bb-407e-bf48-c1c69f5fbb33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/galla-jayadevba8d4a4d-b5bb-407e-bf48-c1c69f5fbb33-415x250-IndiaHerald.jpgగల్లా జయదేవ్ తాను ఎన్నికలలో పోటీ చేయను అని ముందే ప్రకటించారు. దీంతో చంద్రబాబు పెమ్మ‌సాని చంద్రశేఖర్ కు గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వగా ఆయన ఎంపీగా విజయం సాధించడంతోపాటు ఏకంగా కేంద్ర మంత్రి కూడా అయిపోయారు. ఇక ఇప్పుడు పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో గల్లా జయదేవ్ కు ఒక కీలకమైన పదవి కట్ట పెట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది .galla jayadev{#}Kanumuru Raghu Rama Krishnam Raju;Galla Jayadev;Guntur;Rajya Sabha;MP;Minister;MLA;Telugu Desam Party;TDP;CBN;Bharatiya Janata Party;central government;Partyగ‌ల్లా జ‌య‌దేవ్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌... ఆ ప‌ద‌వి ఫిక్స్ చేసిన బాబు...?గ‌ల్లా జ‌య‌దేవ్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌... ఆ ప‌ద‌వి ఫిక్స్ చేసిన బాబు...?galla jayadev{#}Kanumuru Raghu Rama Krishnam Raju;Galla Jayadev;Guntur;Rajya Sabha;MP;Minister;MLA;Telugu Desam Party;TDP;CBN;Bharatiya Janata Party;central government;PartyMon, 12 Aug 2024 10:01:24 GMTగుంటూరు లోక్సభ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు గల్లా జయదేవ్. అయితే ఈ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో గల్లా జయదేవ్ తాను ఎన్నికలలో పోటీ చేయను అని ముందే ప్రకటించారు. దీంతో చంద్రబాబు పెమ్మ‌సాని చంద్రశేఖర్ కు గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వగా ఆయన ఎంపీగా విజయం సాధించడంతోపాటు ఏకంగా కేంద్ర మంత్రి కూడా అయిపోయారు. ఇక ఇప్పుడు పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో గల్లా జయదేవ్ కు ఒక కీలకమైన పదవి కట్ట పెట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది . ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి ఎవరికి ? ఇవ్వాలి అనేదానిపై చంద్రబాబుకు క‌స‌రత్తులు చేస్తున్నారు. ఈ పదవి కోసం టిడిపి నుంచి పలువురు నేతల పోటీపడుతున్నారు.


ఇక మంత్రి పదవి నుంచి స్పీకర్ వరకు చాలా పోస్టులకు పోటీపడిన మాజీ ఎంపీ ... ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే క‌నుమూరు రఘురామ కృష్ణంరాజు కూడా ఈ పదవి ఆశిస్తున్నారు. అయితే చంద్రబాబు దృష్టిలో గల్లా జయదేవ్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు మాజీ రాజ్యసభ సభ్యులు కంభంపాటి రామ్మోహన్ రావు ఈ ప‌దవిలో ఉన్నారు. మరోసారి ఆయనకు ఛాన్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఇదేమి నామినేటిలో పోస్ట్ కాదు ... ప్రభుత్వానికి అత్యంత కీలకం... రెండుసార్లు గుంటూరు ఎంపీగా పనిచేసే జగన్ ప్రభుత్వం వేధింపులతో వ్యాపార పరంగా భారీగా నష్టపోయి ఉన్నారు జయదేవ్.


పైగా ఎన్నికల్లో ఎంపీ సీట్లు కూడా త్యాగం చేశారు. ఢిల్లీలో ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి. పైగా ఆయన వ్యాపారాలు కూడా ఢిల్లీలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగానే ప్రభుత్వ పనులు చేయటానికి కూడా జయదేవ్ అయితే ఎక్కువ టైం కేటాయిస్తారని భావిస్తున్నారు. విచిత్రం ఏంటంటే బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా ఈ పదవి కోసం లాబీయింగ్‌ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆయ‌న‌ బిజెపి నేత ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో ఉండటం ఊహించటం కష్టమని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే సుజనా చౌదరికి ఢిల్లీలో పెద్ద లాబీయింగ్‌ ఉంది. ఈ క్రమంలోనే ఆయన కూడా ఈ పదవిపై కన్నేసినట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఫైనల్ గా ఈ పదవి కోసం ఎవరిని ఎంపిక చేస్తారో చూడాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>