Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-tv9b8c74ac1-c7d0-4d17-999d-3e51e276ebd7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-tv9b8c74ac1-c7d0-4d17-999d-3e51e276ebd7-415x250-IndiaHerald.jpgదేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా సరే ఒక రాజకీయ పార్టీ గురించి ప్రజలందరికి తెలియాలి అంటే ఆ పార్టీకి కచ్చితంగా మీడియా సపోర్ట్ కావాలి. మీడియా ప్రమేయం లేకుండా ఆ పార్టీని నడపడం అసాధ్యం అనే చెప్పాలి. గతంలో మీడియా అంటే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొంచ కుండా నిజాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియజేసేవి. గతంలో న్యూస్ ఛానెల్స్ కూడా ఎంతో పరిమితంగా ఉండేవి.. అయితే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ కారణంగా న్యూస్ ఛానెల్స్ సంఖ్య పెరుగుతూ పోతుంది.ప్రస్తుత న్యూస్ ఛానెల్స్ పరిస్థితి ఎలా ఉందంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి అను# tv9{#}TECHNOLOGY;Ravi Prakaash;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;India;Party;television;media;Telugu;YCPతె(లు)గులు మీడియా : టీవీ 9 బ్రాండ్ కు తగ్గుతున్న ఆదరణ.. అసలు కారణం అదేనా..?తె(లు)గులు మీడియా : టీవీ 9 బ్రాండ్ కు తగ్గుతున్న ఆదరణ.. అసలు కారణం అదేనా..?# tv9{#}TECHNOLOGY;Ravi Prakaash;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;India;Party;television;media;Telugu;YCPMon, 12 Aug 2024 08:33:49 GMT

* నెంబర్ 1 న్యూస్ ఛానల్ గా ఎదిగిన టీవీ 9

* వార్తను సరికొత్తగా చూపించడంలో టీవీ 9 తీరే వేరు

* అనవసరమైనా ఆర్భాటాలు టీవీ 9 స్థాయిని తగ్గించాయా..?



దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా సరే ఒక రాజకీయ పార్టీ గురించి ప్రజలందరికి తెలియాలి అంటే ఆ పార్టీకి కచ్చితంగా మీడియా సపోర్ట్ కావాలి. మీడియా ప్రమేయం లేకుండా ఆ పార్టీని నడపడం అసాధ్యం అనే చెప్పాలి. గతంలో మీడియా అంటే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొంచ కుండా నిజాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియజేసేవి. గతంలో న్యూస్ ఛానెల్స్ కూడా ఎంతో పరిమితంగా ఉండేవి.. అయితే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ కారణంగా న్యూస్ ఛానెల్స్ సంఖ్య పెరుగుతూ పోతుంది.ప్రస్తుత న్యూస్ ఛానెల్స్ పరిస్థితి ఎలా ఉందంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వుంటున్నాయి. దేశంలో పెద్ద రాజకీయ పార్టీ ఏదైనా సరే సొంత ఛానల్ ను కలిగి వున్నాయి. దీనితో మీడియా అనే పదానికి అర్ధం లేకుండా పోతుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో కూడా కొన్ని ఛానెల్స్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నాయి.. న్యూస్ ఛానల్ అంటే తెలుగు రాష్ట్రాలలో వెంటనే తారస పడే పేరు టీవీ 9..గతంలో ప్రింట్ మీడియా కి డిమాండ్ బాగా ఉండేది.. ఆ సమయంలో ప్రైవేట్ న్యూస్ ఛానెల్స్ చాలా తక్కువగా ఉండేవి.. నేషనల్ న్యూస్ ఛానెల్స్ కొన్ని మాత్రమే ఉండేవి.. అలాంటి సమయంలో అప్పట్లో  రవి ప్రకాష్ న్యూస్ చెప్పే విధానంలో సరికొత్త మార్పులు తీసుకువచ్చారు..


 లైవ్ టెలికాస్ట్, ఎంటర్టైన్మెంట్స్, డిబేట్ ఇలా పలు రకాలుగా న్యూస్ ని జనాలకు అందించే వారు. ఆయన టీవీ 9 ఛానల్ కు సీఈఓ గా వుండీ మెరుగైన సమాజం కోసం స్లోగన్ తో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేసి టీవీ 9 టిఆర్పి రేటింగ్ అమాంతం పెంచేసారు. ఎంతలా అంటే దేశంలోనే నెంబర్ వన్ న్యూస్ ఛానల్ గా పేరు తెచ్చుకునేంతగా టీవీ 9 స్థాయి పెరిగింది. టీవీ 9 స్థాయి పాన్ ఇండియా రేంజ్ లో భారీగా పెరిగింది.. అయితే టీవీ 9 రవి ప్రకాష్ పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన టీవీ 9 యాజమాన్యం నుంచి తప్పుకున్నారు..ప్రస్తుతం టీవీ 9 ఛానల్ నెంబర్ 1 ర్యాంకింగ్ తో దూసుకుపోతుంది.. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో చాలా న్యూస్ ఛానెల్స్ కొన్ని పార్టీలకు అతీతంగా పని చేశాయని ఆరోపణలు వచ్చాయి.. అలాగే టీవీ 9 కూడా రాష్ట్రంలో వైసీపీ పార్టీకి కొమ్ము కాసినట్లు అప్లట్లో ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసాయి..


రాష్ట్రం లో టీవీ 9 కి ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదని టీవీ 9 యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది..అంతే కాదు ఎలక్షన్ సమయంలో టీడీపీకి కాస్త అనుకూలంగా కథనాలు వేయడం ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ప్రకటించిన  కూడా ప్రతిపక్షాలు నమ్మలేదు..కూటమి అధికారంలోకి రాగానే చాలా ప్రాంతాలలో టీవీ 9 ఛానల్ టెలికాస్ట్ ని ఆపివేశారు.. అయినా కూడా ఆ ఛానల్ బ్రాండ్ అలానే వుంది.. ప్రస్తుతం ఆ ఛానల్ లో సీనియర్ న్యూస్ రిపోర్టర్ రజనీకాంత్ డిబేట్ అంటే జనాలలో క్రేజ్ ఏర్పడింది..అయితే గతంలో టీవీ 9 కి వున్న క్రేజ్ ఇప్పుడు అంతగా లేదనే చెప్పాలి..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>