PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jaganbc807c95-bdd5-4720-989e-5e3e76dca3fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jaganbc807c95-bdd5-4720-989e-5e3e76dca3fb-415x250-IndiaHerald.jpgవిశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రకరకాల పేర్లు వినిపించినా ఇంతవరకు సీఎం చంద్రబాబు ఎవరి పేర్లు ఖరారు చేయలేదు. నిన్న స్పష్టత ఇస్తారని అనుకున్న అది కూడా వాయిదా పడింది. అసలు పోటీ చేస్తారా లేదా అన్న దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. విశాఖ స్థానిక సంస్థల పోరులో వైసీపీకి బలం ఉంది. కొంతమంది వైసీపీ ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరినా ఇంకా ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉంది. jagan{#}BOTCHA SATYANARAYANA;Vishakapatnam;Paderu;YCP;politics;CBN;CM;local language;Yevaru;Newsఎమ్మెల్సీ ఎన్నిక: జగన్‌ అదిరిపోయే ప్లాన్‌..వణికిపోతున్న బాబు ?ఎమ్మెల్సీ ఎన్నిక: జగన్‌ అదిరిపోయే ప్లాన్‌..వణికిపోతున్న బాబు ?jagan{#}BOTCHA SATYANARAYANA;Vishakapatnam;Paderu;YCP;politics;CBN;CM;local language;Yevaru;NewsMon, 12 Aug 2024 14:08:00 GMTవిశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రకరకాల పేర్లు వినిపించినా ఇంతవరకు సీఎం చంద్రబాబు ఎవరి పేర్లు ఖరారు చేయలేదు. నిన్న స్పష్టత ఇస్తారని అనుకున్న అది కూడా వాయిదా పడింది. అసలు పోటీ చేస్తారా లేదా అన్న దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. విశాఖ స్థానిక సంస్థల పోరులో వైసీపీకి బలం ఉంది. కొంతమంది వైసీపీ ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరినా ఇంకా ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉంది.


దీంతో పోటీపై కూటమి పునరాలోచనలో పడిందని సమాచారం. నిన్న చంద్రబాబుతో జరిగిన సమావేశంలో నేతలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బరిలోకి దిగితే కొంతమంది వైసీపీ ప్రజా ప్రతినిధులను తమ వైపుకు తిప్పుకొని గెలుస్తామని కొంతమంది నేతలు ధీమా వ్యక్తం చేస్తే..... మరికొందరు మాత్రం పోటీ చేయకపోతేనే మంచిదని సూచించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మూడు పార్టీల నాయకులలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు. స్థానిక నేతలతో చర్చించి వారు ఒకటి రెండు రోజుల్లో తమ నివేదికను అధినేతకు ఇవ్వనున్నారు.

ఆ తర్వాతనే పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. విశాఖ జిల్లాపై పట్టున్న బొత్సను అధికారంలోకి దించింది వైసీపీ. ప్రచారంలో స్పీడ్ పెంచిన బొత్స సత్యనారాయణ నియోజకవర్గాల వారీగా మీటింగ్ లు, ఆత్మీయ సమావేశాలతో తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. ఆయన ఎల్లుండి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో జీవీఎంసీ, వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వారంతా ఒకే మాట మీద ఉంటామని చెప్పారని.... బొత్స అంటున్నారు.

విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో క్యాంపు రాజకీయాలు సమావేశమయ్యాయి. తమకు అధిక బలం ఉందన్న కారణంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. అరకు, పాడేరు జడ్పిటీసీ, ఎంపీటీసీలను బెంగుళూరుకు తరలించారు. క్యాంపు బాధ్యతలను, ఎమ్మెల్యేలను వైసీపీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. అందరూ ఈ క్యాంపులో లేరు. వారి పార్టీలో ఎవరు టీడీపీలో చేరతారో తెలియదు. 30వ తేదీన ఎలక్షన్ ఉంటుంది. ఆలోగా ఎంతమంది జంప్ అవుతారో చూడాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>