PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/mithun-reddy467fc6da-1b2d-4005-b5f0-54efdf0ef2c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/mithun-reddy467fc6da-1b2d-4005-b5f0-54efdf0ef2c6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి అత్యంత దారుణమైన పరిస్థితిలో ప్రస్తుతం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా వైసిపి పార్టీ పరిస్థితి తయారయింది. 175 సీట్లు గెలుస్తామని విర్రవీగిన వైసిపి పార్టీకి ఏపీ ప్రజలు... 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అటు నాలుగు ఎంపీలు మాత్రమే వైసిపి పార్టీ గెలవడం జరిగింది. దీంతో.. ఎంపీలను లాగేసుకునేందుకు బిజెపి విశ్వప్రయత్నాలు చేస్తోందట. mithun reddy{#}Kiran Kumar;Mithoon;Parliment;Abhimanyu Mithun;Reddy;MP;central government;Bharatiya Janata Party;Andhra Pradesh;YCP;Jagan;Newsకేంద్ర మంత్రిగా మిథున్ రెడ్డి.. బీజేపీ బంపర్ ఆఫర్?కేంద్ర మంత్రిగా మిథున్ రెడ్డి.. బీజేపీ బంపర్ ఆఫర్?mithun reddy{#}Kiran Kumar;Mithoon;Parliment;Abhimanyu Mithun;Reddy;MP;central government;Bharatiya Janata Party;Andhra Pradesh;YCP;Jagan;NewsMon, 12 Aug 2024 10:41:00 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి అత్యంత దారుణమైన పరిస్థితిలో ప్రస్తుతం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా వైసిపి పార్టీ పరిస్థితి తయారయింది. 175 సీట్లు గెలుస్తామని విర్రవీగిన వైసిపి పార్టీకి ఏపీ ప్రజలు... 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అటు నాలుగు ఎంపీలు మాత్రమే వైసిపి పార్టీ గెలవడం జరిగింది. దీంతో.. ఎంపీలను లాగేసుకునేందుకు బిజెపి విశ్వప్రయత్నాలు చేస్తోందట.


ఇందులో ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబానికి బిజెపి పార్టీ గాలం వేసినట్లు మొదటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పెద్దిరెడ్డి అలాగే ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా బిజెపి పార్టీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను వారు ఎంత ఖండించినా కూడా అదే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి పార్టీ తనకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసిందని... ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఎంపీ మిథున్ రెడ్డి.


అయితే ఆ ఆఫర్ ఇప్పుడు వచ్చింది కాదని... 2014 నుంచి తమ కుటుంబానికి ఆఫర్లు వస్తున్నాయని తెలిపారు. 2014 నుంచి బిజెపి పార్టీ... తమ వెంట పడుతూనే ఉందని మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కానీ జగన్ మోహన్ రెడ్డిని వీడి ఏ పార్టీలోకి చేరబోమని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబానికి అనేక అవకాశాలు ఇచ్చాడని గుర్తు చేశారు మిథున్ రెడ్డి.


అలాంటి జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెంట మేము నడుస్తామని కూడా ప్రకటించారు. ఎవరెన్ని ప్రచారాలు చేసిన బిజెపి పార్టీలోకి వెళ్ళేది లేదని తేల్చి చెప్పారు. అనేక రకాలైన వార్తలు వస్తూనే ఉంటాయని...వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. వైసిపి పార్టీ మరోసారి.. అధికారంలోకి రావడం గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. కాగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పైన మిథున్ రెడ్డి విజయం సాధించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>