MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vishwa-prasad556abe1f-2b23-423b-9a36-e3adea801acc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vishwa-prasad556abe1f-2b23-423b-9a36-e3adea801acc-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సంజయ్ దత్ , ప్రభాస్ కి తాత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నీది అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్దీ కుమార్ లు హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని హార్రర్ , రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూvishwa prasad{#}Sanjay Dutt;malavika new;Kumaar;vishwa;sree;Heroine;Romantic;raja;Prabhas;Telugu;harish shankar;Mass;ravi teja;Ravi;Mister;Cinema;Interview"రాజా సాబ్" పై అలాంటి ప్రచారం... అది మాకే మంచిది అంటున్న నిర్మాత..?"రాజా సాబ్" పై అలాంటి ప్రచారం... అది మాకే మంచిది అంటున్న నిర్మాత..?vishwa prasad{#}Sanjay Dutt;malavika new;Kumaar;vishwa;sree;Heroine;Romantic;raja;Prabhas;Telugu;harish shankar;Mass;ravi teja;Ravi;Mister;Cinema;InterviewMon, 12 Aug 2024 17:18:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సంజయ్ దత్ , ప్రభాస్ కి తాత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నీది అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్దీ కుమార్ లు హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని హార్రర్ , రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే రాజా సాబ్ మూవీ నిర్మాత అయినటువంటి టీ జీ విశ్వ ప్రసాద్ తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని కూడా రూపొందించాడు. ఈ సినిమాను ఆగస్టు 15బ్వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో విశ్వ ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయన రాజా సాబ్ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ... కొంత మంది పని కట్టుకొని మరీ రాజా సాబ్ మూవీ పై నెగటివ్ విషయాలను స్ప్రెడ్ చేస్తున్నారు. అది మాకు చాలా మంచిది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ నటించిన సినిమాలకు వందల , వేల కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. ఆ స్టామినా రాజా సాబ్ మూవీ కి లేదు అని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. కానీ అది మాకే మంచిది. రాజా సాబ్ సినిమాలో ఒక గొప్ప కథ ఉంది. ఆ సినిమా విడుదల అయిన తర్వాత దాని సత్తా ఏమిటో తెలుస్తుంది. అప్పుడు ఆ సినిమా కూడా వందల , వేల కోట్ల కలెక్షన్లను రాబడుతుంది అని విశ్వ ప్రసాద్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>