MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nhiharika-comitikurallu-moive-collcationcs-success1d6f1c41-6d76-42d1-8c43-cacd85afa972-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nhiharika-comitikurallu-moive-collcationcs-success1d6f1c41-6d76-42d1-8c43-cacd85afa972-415x250-IndiaHerald.jpgNiharika.. మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో ఇటీవలే పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యానర్ పై కమిటీ కుర్రోళ్ళు అనే చిత్రాన్ని నిర్మించింది నిహారిక. ఈనెల తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొత్తం 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు. అందరూ కొత్తవాళ్లే కావడం గమనార్హం. యదువంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పల్లెటూరిలో జరిగే ఒక జాతర ఎన్నికలను నేపథ్యNHIHARIKA;COMITIKURALLU;MOIVE;COLLCATIONCS;SUCCESS{#}niharika konidela;ram pothineni;Mister;ravi teja;Ravi;Pink;producer;Producer;Success;News;CinemaNiharika: కమిటీ కుర్రోళ్ళు కలెక్షన్స్.. నిహారిక నిర్మాతగా సక్సెస్ అయినట్టేనా..?Niharika: కమిటీ కుర్రోళ్ళు కలెక్షన్స్.. నిహారిక నిర్మాతగా సక్సెస్ అయినట్టేనా..?NHIHARIKA;COMITIKURALLU;MOIVE;COLLCATIONCS;SUCCESS{#}niharika konidela;ram pothineni;Mister;ravi teja;Ravi;Pink;producer;Producer;Success;News;CinemaMon, 12 Aug 2024 19:26:00 GMTNiharika.. మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో ఇటీ వలే పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యానర్ పై కమిటీ కుర్రోళ్ళు అనే చిత్రాన్ని నిర్మించింది నిహారిక. ఈనెల తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే మంచి హిట్ టాక్ తో దూసుకు పోతోంది. మొత్తం 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు. అందరూ కొత్తవాళ్లే కావడం గమనార్హం. యదువంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పల్లెటూరి లో జరిగే ఒక జాతర ఎన్నికలను నేపథ్యంగా తీసుకుని కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి నిర్మాతగా నిహారిక కూడా చాలా కష్టపడిందని చెప్పవచ్చు.

ఇక పోతే ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు కలెక్షన్ల పరంగా కూడా టార్గెట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం సినిమా బాగుందని అందరూ అనడమే కాదు మూడు రోజుల్లోనే రూ.6.04 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మొత్తానికైతే నిర్మాత గా నిహారిక పాస్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో మూడు రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం రానుంది.  పైగా ఆగస్టు 15న రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్,  రామ్ పోతినేని నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలు విడుదల కానున్నాయి.

మరి బడా సినిమాలను తట్టుకొని నిహారిక సినిమా ఏ మేరకు నిలబడుతుందో చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈమె ఇప్పుడు సక్సెస్ అయినట్లే అంటూ వార్తలు వినిపిస్తుంది. మంచి పల్లె టూరు వాతావరణం లో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలు ఇలా అన్నింటినీ కలగలిపి కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>