Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gallae02380e4-a53d-4b0f-a0ae-c3dd10ec4513-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gallae02380e4-a53d-4b0f-a0ae-c3dd10ec4513-415x250-IndiaHerald.jpg • ఏపీ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేస్తున్న సీనియర్ లీడర్లు • గల్లా జయదేవ్ రాజీనామా ఒక సంచలనం • వ్యాపారాల కోసం పాలిటిక్స్ ని వదిలేసారు (ఏపీ - ఇండియా హెరాల్డ్) ఏపీ బిజినెస్‌మ్యాన్, టీడీపీ పొలిటికల్ లీడర్ గల్లా జయదేవ్ 2014 నుంచి రాజకీయాల్లో చురుగ్గా మారారు. రెండుసార్లు టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి మాత్రం ఆయన పోటీ చేయలేదు. జయదేవ్ గల్లా ఇటీవల మాట్లాడుతూ "నేను రాజకీయాలను వదGalla{#}Galla Jayadev;Narendra Modi;Galla Arunakumari;February;Prime Minister;Bahubali;Parliament;Parliment;history;Guntur;Leader;Andhra Pradesh;marriage;India;TDP;mahesh babu;Government;రాజీనామాబై బై పాలిటిక్స్: పాలిటిక్స్ నుంచి తప్పుకున్న గల్లా జయదేవ్.. గెలుస్తున్నా ఎందుకు రాజీనామా..?బై బై పాలిటిక్స్: పాలిటిక్స్ నుంచి తప్పుకున్న గల్లా జయదేవ్.. గెలుస్తున్నా ఎందుకు రాజీనామా..?Galla{#}Galla Jayadev;Narendra Modi;Galla Arunakumari;February;Prime Minister;Bahubali;Parliament;Parliment;history;Guntur;Leader;Andhra Pradesh;marriage;India;TDP;mahesh babu;Government;రాజీనామాSat, 10 Aug 2024 14:00:00 GMT

ఏపీ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేస్తున్న సీనియర్ లీడర్లు

గల్లా జయదేవ్ రాజీనామా ఒక సంచలనం  

• వ్యాపారాల కోసం పాలిటిక్స్ ని వదిలేసారు  

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

ఏపీ బిజినెస్‌మ్యాన్, టీడీపీ పొలిటికల్ లీడర్ గల్లా జయదేవ్ 2014 నుంచి రాజకీయాల్లో చురుగ్గా మారారు. రెండుసార్లు టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి మాత్రం ఆయన పోటీ చేయలేదు.  

జయదేవ్ గల్లా ఇటీవల మాట్లాడుతూ "నేను రాజకీయాలను వదిలేస్తున్నా. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. వ్యాపారవేత్తగా రాజకీయాలు, వ్యాపారం రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టం. ప్రజల కోసం పోరాడిన చరిత్ర నా కుటుంబానికి ఉంది, కానీ నేను ఒక విషయంపైనే దృష్టి పెట్టగలను. పెట్టుబడులు పెట్టడం, ఆవిష్కరణలు చేయడం, ఉద్యోగాలను సృష్టించడం, సంపదను సృష్టించడం ద్వారా భారతదేశానికి సహాయం చేస్తూనే ఉంటాను, కానీ నేను రాజకీయాల్లో ఉండను." అని స్పష్టం చేశారు. రెండుసార్లు పోటీ చేస్తే రెండు సార్లు కూడా ఆయన గెలిచి ఆశ్చర్యపరిచారు.

జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి మాజీ మంత్రి. ఆమె బాటలోనే నడవాలని పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. 10 ఏళ్లపాటు పార్లమెంట్ లో తన గళం వినిపించారు. కానీ వ్యాపారాన్ని, దీన్ని రెండిటినీ మేనేజ్ చేయడం కష్టమని భావించిన ఆయన పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చారు. ఘట్టమనేని పద్మావతిని జయదేవ్ పెళ్లి చేసుకున్నారు. అందుకే మహేష్ బాబు ఈయనకు బావ అవుతారు.

జయదేవ్ గల్లా పార్లమెంటు స్పీచ్ ఒకటి భారతదేశంలో బాగా హైలెట్ అయింది. 2018, ఫిబ్రవరి 7న లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని గల్లా జయదేవ్ గల్లా దూకుడుగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన నిధుల కంటే బాహుబలి సినిమా ఎక్కువ వసూళ్లు రాబట్టిందని ఆయన కేంద్రాన్ని పారేశారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు గత నాలుగేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.

16 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, వాగ్దానాల విషయంలో జాప్యం చేస్తోందని జయదేవ్ తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు అన్యాయం జరిగిందో ఆర్థిక మంత్రి, ప్రధాని వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత బాగా మాట్లాడే గల జయదేవ్ ఏపీ పాలిటిక్స్ నుంచి తప్పుకోవడం బాధాకరమని చెప్పుకోవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>