Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dravidcecaf479-fbf0-4674-bddc-28fb382f6f7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dravidcecaf479-fbf0-4674-bddc-28fb382f6f7c-415x250-IndiaHerald.jpg ఏ జట్టు అయినా సరైన కోచ్ ఉంటే విజయాలు సాధించక తప్పదు. టీమిండియాలో కూడా అలాగే జరిగింది. ఇండియా టీమ్‌కు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పదవి నుంచి వైదొలిగినప్పటికీ మార్కెట్లో మాత్రం ఆయనకు ఫుల్ డిమాండ్ ఉంది. టీమిండియా విజయాల్లో రాహుల్ ద్రవిడ్ పాత్ర కీలకం అనే చెప్పాలి. ద్రవిడ్ కోచింగ్ లోనే టీ20 వరల్డ్ కప్ 2024ను టీమిండియా సాధించింది. ఆతర్వాత హెడ్ కోచ్ పదవి కాలం ముగియడంతో ద్రవిడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆయన ఖDravid{#}Sri Lanka;Gautam Gambhir;ICC T20;rahul;Rahul Sipligunj;India;Rajasthan;Cricketఐపీఎల్ పై కన్నేసిన ద్రవిడ్.. మళ్ళి రీఎంట్రీ?ఐపీఎల్ పై కన్నేసిన ద్రవిడ్.. మళ్ళి రీఎంట్రీ?Dravid{#}Sri Lanka;Gautam Gambhir;ICC T20;rahul;Rahul Sipligunj;India;Rajasthan;CricketSat, 10 Aug 2024 09:16:48 GMTఐపీఎల్ లోకి రీఎంట్రీ ఇస్తోన్న ద్రవిడ్


ఏ జట్టు అయినా సరైన కోచ్ ఉంటే విజయాలు సాధించక తప్పదు. టీమిండియాలో కూడా అలాగే జరిగింది. ఇండియా టీమ్‌కు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పదవి నుంచి వైదొలిగినప్పటికీ మార్కెట్లో మాత్రం ఆయనకు ఫుల్ డిమాండ్ ఉంది. టీమిండియా విజయాల్లో రాహుల్ ద్రవిడ్ పాత్ర కీలకం అనే చెప్పాలి. ద్రవిడ్ కోచింగ్ లోనే టీ20 వరల్డ్ కప్ 2024ను టీమిండియా సాధించింది. ఆతర్వాత హెడ్ కోచ్ పదవి కాలం ముగియడంతో ద్రవిడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆయన ఖాళీగానే ఉన్నారు. ఈ సమయంలోనే ఆయన్ని తమ జట్టుకు కోచ్‌గా తీసుకోవాలని అనేక జట్లు పోటీ పడుతున్నాయి. కానీ ద్రవిడ్ మాత్రం ఇంకా ఏ జట్టుకూ మొగ్గు చూపడం లేదు. అయితే క్రిక్ బజ్ నివేదిక ప్రకారంగా రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్ అవుతారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ జట్టుకు కోచ్‌గా శ్రీలంక స్టార్ క్రికెటర్ కుమార సంగర్కర ఉన్నారు. ఆయన స్థానంలోకే ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ వెళ్లనున్నాడనే మాట వినిపిస్తోంది.

మరోవైపు సంగర్కరను కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రధాన కోచ్ బాధ్యతలను ఇచ్చే అవకాశం ఉంది. ఇంగ్లండ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న మాథ్యూ వేడ్ గత నెలలోనే తన పదవిని వదిలిపెట్టారు. ప్రస్తుతం ఆయన స్థానం ఖాళీగానే ఉంది. ఆయన స్థానంలోకే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న సంగర్కర వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి ద్రవిడ్ వైదొలిగినప్పుడు చాలా ఫ్రాంచైజీలు ఆయన కోసం పోటీ పడ్డాయి. ద్రవిడ్ స్థానంలోకి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మాజీ మెంటార్ గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ అయ్యారు. ద్రవిడ్ కూడా గతంలో 2014లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మెంటార్‌గా ఉన్నారు. అందుకే ఆయన్ని పూర్తి స్థాయిలో కోచ్‌గా రాజస్థాన్ రాయల్స్ తీసుకోనుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>