PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagand9ddff95-f50d-4af7-9820-7ff04a815b41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagand9ddff95-f50d-4af7-9820-7ff04a815b41-415x250-IndiaHerald.jpgఇది ఆ పార్టీకి ఘోర పరాజయం లాంటిది.. పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది వైసీపీని వీడి బయటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన మహిళ నేత ... ఆ పార్టీ మాజీ ఎంపీ బుట్టా రేణుక సైతం వైసీపీని వీడి తెలుగుదేశం లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోందిys.jagan{#}Kurnool;MP;India;Assembly;TDP;Jagan;Telugu Desam Party;YCPవైసీపీకి ఆ లేడీ లీడ‌ర్ గుడ్ బై ... మ‌ళ్లీ సైకిల్ ఎక్కుతారట‌..?వైసీపీకి ఆ లేడీ లీడ‌ర్ గుడ్ బై ... మ‌ళ్లీ సైకిల్ ఎక్కుతారట‌..?ys.jagan{#}Kurnool;MP;India;Assembly;TDP;Jagan;Telugu Desam Party;YCPSat, 10 Aug 2024 08:35:07 GMT- 2014 లో క‌ర్నూలు ఎంపీగా గెలుపు .. ఆ వెంట‌నే టీడీపీ చెంత‌కు
- 2019 ఎన్నిక‌ల టైంలో తిరిగి వైసీపీ లోకి రీ ఎంట్రీ
- 2024 లో వైసీపీ నుంచి ఎమ్మిగ‌నూరు అసెంబ్లీకి పోటీ చేసి ఓట‌మి
- ఇప్పుడు తిరిగి టీడీపీ లోకి రీ ఎంట్రీ నా..?

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) .

ఆంధ్రప్రదేశ్లో ఈ యేడది జరిగిన సాధారణ ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అసలు ఆ పార్టీ నేతలు ఊహించని విధంగా వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలు ... నాలుగు లోక్సభ స్థానాలతో సరిపెట్టుకుంది. ఇది ఆ పార్టీకి ఘోర పరాజయం లాంటిది.. పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది వైసీపీని వీడి బయటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన మహిళ నేత ... ఆ పార్టీ మాజీ ఎంపీ బుట్టా రేణుక సైతం వైసీపీని వీడి తెలుగుదేశం లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికలలో వైసీపీ నుంచి కర్నూలు ఎంపీగా విజయం సాధించిన రేణుక ఆ తర్వాత టిడిపికి దగ్గరయ్యారు. 2019 ఎన్నికలలో ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో ఒక సీటు వస్తుందని ఆశించిన నెరవేరలేదు.


2019లో రాష్ట్రంలో వైసిపి గెలుస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఆమె తిరిగి వైసిపి చెంత చేరారు. చివరకు ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రేణుకకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఇక ఈ ఎన్నికలకు ముందు రేణుకకు జగన్ ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. రేణుక ఎమ్మిగనూరులో ఓడిపోయారు. దీంతో తిరిగి ఆమె మళ్ళీ టిడిపి గూటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఒకసారి టిడిపిలోకి వచ్చి 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలోకి వెళ్లిన ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు కర్నూలు జిల్లా టిడిపి నేతలు ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>