Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sumanthc908f677-0e5a-42dc-8ee3-73394268f932-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sumanthc908f677-0e5a-42dc-8ee3-73394268f932-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమాలు వచ్చాయి. ఖుషి, తొలిప్రేమ, మల్లీశ్వరి, జయం, వర్షం, ఒక్కడు మన్మధుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే లవ్ స్టోరీస్ మన తెలుగులో వచ్చి హిట్ అయ్యాయి. అలాంటి ప్రేమ కథలు తీస్తూ హీరో అక్కినేని సుమంత్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చే మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశాడు. "ప్రేమకథా" సినిమాతో సుమంత్ తన కెరీర్ ప్రారంభించాడు. తరువాత సత్యం, గౌSumanth{#}Okkadu;Golconda;sumanth;Hero;Romantic;Love Story;Audience;Tarun Kumar;Blockbuster hit;kalyan;Cinema;prema;Love;Heroineనువ్వే కావాలి సినిమాని కొద్దిలో మిస్ చేసుకున్న యాక్టర్ సుమంత్..?నువ్వే కావాలి సినిమాని కొద్దిలో మిస్ చేసుకున్న యాక్టర్ సుమంత్..?Sumanth{#}Okkadu;Golconda;sumanth;Hero;Romantic;Love Story;Audience;Tarun Kumar;Blockbuster hit;kalyan;Cinema;prema;Love;HeroineSat, 10 Aug 2024 19:36:00 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమాలు వచ్చాయి. ఖుషి, తొలిప్రేమ, మల్లీశ్వరి, జయం, వర్షం, ఒక్కడు మన్మధుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే లవ్ స్టోరీస్ మన తెలుగులో వచ్చి హిట్ అయ్యాయి. అలాంటి ప్రేమ కథలు తీస్తూ హీరో అక్కినేని సుమంత్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చే మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశాడు.

"ప్రేమకథా" సినిమాతో సుమంత్ తన కెరీర్ ప్రారంభించాడు. తరువాత సత్యం, గౌరి, గోదావరి, గోల్కొండ హైస్కూల్ వంటి ఫీల్ గుడ్ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎన్నిసార్లు అయినా చూడగల చిత్రాలను సుమంత్ తీశాడు. మంచి సినిమాలు ఎన్నో తీయగలిగాడు కానీ ఒక అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాగా బీభత్సమైన స్టార్‌డమ్ మాత్రం దక్కించుకోలేకపోయాడు. కొన్నేళ్ల క్రితం నుంచి   సుమంత్ హీరోగా చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత అతను హీరోగా సినిమాలు రావడమే మానేశాయి.

హీరో అవకాశాలు రాకపోవడంతో సపోర్టింగ్ యాక్టర్ గా మారాడు. సీతారామం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో బాగా నటించి అలరించాడు. మంచి స్క్రిప్ట్స్‌ వస్తే హీరో రోల్ కాకపోయినా చేస్తానని సుమంత్ అంటున్నాడు. ఇటీవల సుమంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటిదాకా తాను రిజెక్ట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయని అన్నాడు   అయితే ఒక సినిమా తాను చేయాలనుకున్నా చేయలేకపోయాను అని తెలిపాడు. అదే "నువ్వే కావాలి". ఆ మూవీ ఆఫర్ ముందుగా తన వద్దకే వచ్చిందని కానీ వేరే సినిమాలతో కమిట్ కావడం డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల దాన్ని అయిష్టంగానే వదులుకున్నానని సుమంత్ తెలిపాడు.

 దానివల్ల అతను ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోల్పోయాడు. ఈ సినిమాలో హీరోగా తరుణ్ యాక్ట్ చేశాడు. రిచా హీరోయిన్ పాత్రలో అలరించింది. కే విజయభాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీ సినిమాలలో ఒకటిగా నిలుస్తుంది. ఇందులో కోటి కంపోజ్ చేసిన పాటలు కూడా చాలా బాగుంటాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>