PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp10c7ab01-6cc2-4235-9424-c4afec8295fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp10c7ab01-6cc2-4235-9424-c4afec8295fe-415x250-IndiaHerald.jpgఆ తర్వాత 1983లో మార్టూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరణం బలరాం అంటే ఒక శక్తివంతమైన రాజకీయనేతగా పేరు ఉంది. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేత శభాష్ అని ప్రశంసలు అందుకున్న చరిత్ర కరణం బలరాం ది. ఆ తర్వాత తెలుగుదేశం నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళిన బలరాం 1994లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారుycp{#}KARANAM BALARAMA KRISHNA MURTHY;Prakasam;chirala;Karanam Venkatesh;Addanki;Venkatesh;Varasudu;history;K S Ravikumar;Telugu Desam Party;Assembly;Party;Andhra Pradesh;Congress;TDP;Telugu;YCPఅన్ని కండువాలు మార్చేసిన ఆ గోదారి కురువృద్ధుడి శ‌కం ముగిసిందా.. ?అన్ని కండువాలు మార్చేసిన ఆ గోదారి కురువృద్ధుడి శ‌కం ముగిసిందా.. ?ycp{#}KARANAM BALARAMA KRISHNA MURTHY;Prakasam;chirala;Karanam Venkatesh;Addanki;Venkatesh;Varasudu;history;K S Ravikumar;Telugu Desam Party;Assembly;Party;Andhra Pradesh;Congress;TDP;Telugu;YCPSat, 10 Aug 2024 09:01:02 GMT- నాలుగున్న‌ర ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర క‌ర‌ణం ఫ్యామిలీది
- ఎంపీ, ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీగా క‌ర‌ణం రికార్డ్‌
- రెండు సార్లు.. రెండు పార్టీలు.. రెండు చోట్ల ఓడిన క‌ర‌ణం వార‌సుడు

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

కరణం బలరాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోని ఒక వెలుగు వెలిగిన నేత. 1978లోనే కాంగ్రెస్పార్టీ నుంచి అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం ... ఆ తర్వాత 1983లో మార్టూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరణం బలరాం అంటే ఒక శక్తివంతమైన రాజకీయనేతగా పేరు ఉంది. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేత శభాష్ అని ప్రశంసలు అందుకున్న చరిత్ర కరణం బలరాం ది. ఆ తర్వాత తెలుగుదేశం నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళిన బలరాం 1994లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 1999లో టిడిపిలోకి వచ్చిన క‌ర‌ణం బలరాం ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. తిరిగి 2004 ఎన్నికలలో అద్దంకి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన 2009లో మాత్రం గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓడిపోయారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలలో అద్దంకి నుంచి తన వారసుడు కరణం వెంకటేష్‌ను పోటీ చేయించ‌గా వెంకటేష్ ఆ ఎన్నికల్లో గొట్టిపాటి ర‌వి చేతిలో ఓడిపోయారు.


ఇక 2019 ఎన్నికలలో చీరాల కుమారిన బలరాం అక్కడ టిడిపి నుంచి పోటీ చేసి ఏకంగా 17వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బలరాం తన కుమారుడు వెంకటేష్ తో కలిసి వైసిపి లోకి వెళ్లిపోయారు. తాజా  ఎన్నికల్లో వెంకటేష్ తనయుడు బలరాం తనయుడు కరణం వెంకటేష్ చీరాల నుంచి అసెంబ్లీ పోటీ చేసి ఓడిపోయారు. బలరాం నాలుగున్నర దశాబ్దాల పాటు తెలుగు రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. ఎంపీగా.. ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీగా కూడా విజయాలు సాధించారు. అయితే తన వారసుడు వెంకటేష్‌ను రెండుసార్లు అద్దంకి - చీరాలలో టిడిపి వైసిపి నుంచి పోటీ చేయించినా వారసుడిని మాత్రం గెలిపించుకోలేకపోయారు. ఏది ఏమైనా కరణం బలరాం రాజకీయ చరిత్ర దాదాపు ముగిసినట్టే చెప్పాలి. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను కొన్ని సంవత్సరాలపాటు తన క‌నుసైగ‌లతో శాసించిన బలరాం శకం ఇక ముగిసినట్టే చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>