MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg‘దసరా’ మూవీలో విలన్ పాత్రలో నటించిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఆమూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. త్వరలో విడుదల కాబోతున్న ‘దేవర’ మూవీలో కూడ అతడు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మలయాళ ఫిలిమ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడుగా పేరు గాంచిన చాకో బయట ఫంక్షన్స్ లో కనిపించినప్పుడు అతడి ప్రవర్తన కొంత విచిత్రంగా ఉంటుందని అంటూ ఉంటారు. సినిమాల ఫంక్షన్స్ కు సంబంధించి వేదిక పై ఉన్నప్పుడు బయట మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు చాకో వ్యవహారశైలి చాల విభిన్నంగా ఉంటుంది అన్న ప్రచారం ఉంది. దీనికి కTOLLYWOOD{#}vedhika;Tom Banton;Tom Hooper;Athadu;marriage;media;Teluguఅరుదైన వ్యాధితో బాధపడుతున్న విలక్షణ నటుడు !అరుదైన వ్యాధితో బాధపడుతున్న విలక్షణ నటుడు !TOLLYWOOD{#}vedhika;Tom Banton;Tom Hooper;Athadu;marriage;media;TeluguSat, 10 Aug 2024 08:19:23 GMT‘దసరా’ మూవీలో విలన్ పాత్రలో నటించిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఆమూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. త్వరలో విడుదల కాబోతున్న ‘దేవర’ మూవీలో కూడ అతడు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మలయాళ ఫిలిమ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడుగా పేరు గాంచిన చాకో బయట ఫంక్షన్స్ లో కనిపించినప్పుడు అతడి ప్రవర్తన కొంత విచిత్రంగా ఉంటుందని అంటూ ఉంటారు.



సినిమాల ఫంక్షన్స్ కు సంబంధించి వేదిక పై ఉన్నప్పుడు బయట మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు చాకో వ్యవహారశైలి చాల విభిన్నంగా ఉంటుంది అన్న ప్రచారం ఉంది. దీనికి కారణం అతడికి చాల అరుదైన అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ ఉంది అన్న ప్రచారం ఉంది. ఈవిషయాన్ని చాకో కూడ స్వయంగా అంగీకరించాడు అని అంటారు.



ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులు తరచుగా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారని తమను చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు గుర్తించాలని కోరుకుంటారని ఇతర నటుల నుండి ప్రత్యేకంగా నిలబడటానికి ప్రయత్నిస్తారని వైద్యులు చెపుతూ ఉంటారు. అరుదైన ఈ డిజార్డర్ వల్ల విలక్షణ నటుడి మ్యారేజ్ కూడ క్యాన్సిల్ అయిందని స్వయంగా చాకో ఒక ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.



ఈ సంవత్సరం జనవరిలో తనూజ అనే అమ్మాయితో షైన్ తన ఎంగేజ్మెంట్ అయిందని ప్రకటించి అందరు అతడి పెళ్ళికోశం ఎదురు చూస్తున్న సమయంలో తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని ప్రకటించి అందరికీ మరొకసారి షాక్ ఇచ్చాడు. తనూజ తో పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి గల కారణం తన అనారోగ్యం అంటూ ఓపెన్ గానే తన ఇంటర్వ్యూలో చెప్పాడు. తన అనారోగ్యానికి గల కారణం డాక్టర్స్ కూడ సరిగ్గా చెప్పలేకపోతున్నారని షైన్ చాకో బాధపడుతున్నాడు. ప్రస్తుతం సమాజంలో చాలామందికి వస్తున్న విచిత్రమైన అనారోగ్యాలకి కారణాలు తెలియని పరిస్థితులలో షైన్ కు వచ్చిన అనారోగ్యం పట్ల అతడి అభిమానులు అతడి పై సానుభూతి చూపెడుతున్నారు..    










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>