Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood39cd7872-3ccb-403d-9e84-f93d3a4272a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood39cd7872-3ccb-403d-9e84-f93d3a4272a5-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు అటు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూ తన నటనతో డాన్స్ లతో ప్రేక్షకులను అలరించిన జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతారం ఎత్తాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన నటన నైపుణ్యంతో ప్రపంచ సినీ ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధుల్ని చేసి అభిమానులుగా మార్చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం త్రిబుల్ ఆర్ తర్వాత తారక్ ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు అనే విషయం గురించి అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాTollywood{#}koratala siva;Yash;Posters;electricity;Maharashtra;Rajamouli;prasanth;Prashant Kishor;NTR;Pooja Hegde;Tollywood;Cinema;Nijam;Director;Jr NTRయష్, ప్రభాస్ మాత్రమే లేదు.. తారక్ తోనూ అలాంటి సినిమానే ప్లాన్ చేసిన నీల్?యష్, ప్రభాస్ మాత్రమే లేదు.. తారక్ తోనూ అలాంటి సినిమానే ప్లాన్ చేసిన నీల్?Tollywood{#}koratala siva;Yash;Posters;electricity;Maharashtra;Rajamouli;prasanth;Prashant Kishor;NTR;Pooja Hegde;Tollywood;Cinema;Nijam;Director;Jr NTRSat, 10 Aug 2024 11:30:00 GMTమొన్నటి వరకు అటు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూ తన నటనతో డాన్స్ లతో ప్రేక్షకులను అలరించిన జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతారం ఎత్తాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన నటన నైపుణ్యంతో ప్రపంచ సినీ ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధుల్ని చేసి అభిమానులుగా మార్చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం త్రిబుల్ ఆర్ తర్వాత తారక్ ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు అనే విషయం గురించి అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న మూవీ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ ని కూడా ఇటీవల ప్రారంభించారు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడు క్రేజీ స్టోరీస్ తో హీరోలను మరింత ఎలివేట్ చేసి చూపించే ప్రశాంథ్ నీల్  అటు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వర్సటైల్ యాక్టర్ తో ఎలాంటి స్టోరీ ప్లాన్ చేశాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఇక తారక్ - నీల్ కాంబో మూవీ స్టోరీ ఇదే అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.



 ఇక సోషల్ మీడియాలో జనాలు ఈ విషయాన్ని బాగా వైరల్ చేసేస్తూ ఉన్నారు. మేకర్స్ ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ క్యాప్షన్ ఆధారంగా 1969లో మహారాష్ట్ర తారాపూర్ లో ప్రారంభమైన తొలి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం చుట్టూ కథ నడుస్తుంది అని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇక అందులో ఎన్టీఆర్ కార్మికుడిగా పని చేస్తారేమో నంటూ ఊహించుకుంటున్నారు. మరి కొంతమంది కార్మిక నాయకుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అంటూ ఊహగానాల్లోకి వెళ్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే గాని ఎవరికీ తెలియదు.

ఇక మరో విషయంపై కూడా చర్చ జరుగుతుంది ఇప్పటికే యష్ ప్రభాస్ లతో సినిమా తీసి హిట్టు కొట్టిన ప్రశాంత్ నీల్.. అందరిలా కలర్ఫుల్ సినిమా కాకుండా కాస్త డిఫరెంట్ కలర్ తో సినిమా తీస్తాడు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా ఇలాంటి సినిమా చేయబోతున్నాడు ఇక ఇటీవల విడుదలైన సినిమా పోస్టర్ చూస్తూ ఉంటే.. గత సినిమాల్లో లాగానే ఇక ఈ సినిమా కూడా కలర్ఫుల్ గా కాకుండా కలర్ లెస్ గా నీల్ స్టైల్ లోనే ఉండబోతుంది అన్నది తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>