Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh24fe867f-41ff-4a7a-9636-53bc7ae84866-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh24fe867f-41ff-4a7a-9636-53bc7ae84866-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వారసులదే హావా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీల నుంచి ఇప్పటికే ఎంతోమంది నటులు అటు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. స్టార్ హీరోల వారసులుగా ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మహేష్ బాబు. అయితే తక్కువ సమయంలోనే అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయాడు అని చెప్పాలి. అంతేకాదు తండ్రికి తగ్గMahesh{#}gautham new;gautham;Gautam Adani;Yuvaraju;mahesh babu;krishna;Rajani kanth;choudary actor;Tollywood;Father;Press;Director;Teluguమహేష్ కొడుకు సినిమా ఎంట్రీపై.. YVS చౌదరి షాకింగ్ కామెంట్స్?మహేష్ కొడుకు సినిమా ఎంట్రీపై.. YVS చౌదరి షాకింగ్ కామెంట్స్?Mahesh{#}gautham new;gautham;Gautam Adani;Yuvaraju;mahesh babu;krishna;Rajani kanth;choudary actor;Tollywood;Father;Press;Director;TeluguSat, 10 Aug 2024 08:46:00 GMTఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వారసులదే హావా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీల నుంచి ఇప్పటికే ఎంతోమంది నటులు అటు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. స్టార్ హీరోల వారసులుగా ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మహేష్ బాబు. అయితే తక్కువ సమయంలోనే అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయాడు అని చెప్పాలి.


 అంతేకాదు తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకొని.. నేటితరం ప్రేక్షకులకు సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నాడు మహేష్. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకడిగా ఉన్నాడు అని చెప్పాలి. కొంతకాలం నుంచి వరుసగా సూపర్ హిట్ లు కొడుతూ దూసుకుపోతున్నాడు. అయితే ఇక మహేష్ బాబు వారసుడిగా గౌతం ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గౌతమ్ ఏకంగా తండ్రి లాగానే హైట్ పెరిగి ఎంతో హ్యాండ్సమ్ గా మారిపోయాడు. ఫిట్నెస్ ని కూడా మైంటైన్ చేస్తున్నాడు. దీంతో గౌతమ్ ఎంట్రీ గురించి ఘట్టమనేని ఫ్యాన్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే మహేష్ బాబు తనయుడు గౌతంను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఛాన్స్ తనకు వస్తే బాగుండు అని డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాల నటుడిగా ఉన్నప్పుడే మహేష్ బాబు సూపర్ స్టార్ అవుతారని తాను ఊహించానని ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో తెలిపాడు. మహేష్ తో యువరాజు సినిమా చేయడం తన అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కావాలనే మహేష్ ను రిక్వెస్ట్ చేసి మరి సినిమాలో కృష్ణుడి పాత్ర వేయించినట్లు చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు మహేష్ తనయుడు గౌతమ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఛాన్స్ తనకు వస్తే తప్పకుండా చేస్తానని.. అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు అంటూ వైవిఎస్ చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>