Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababucf6de599-9c55-4234-811a-ca51026f5fab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababucf6de599-9c55-4234-811a-ca51026f5fab-415x250-IndiaHerald.jpg వైసీపీ కార్యకర్తలు ఇటీవల కాలంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను విమర్శించడం లేదు. వారు చేసే పాలనా తప్పులను కూడా నిందించడం లేదు. వాస్తవానికి ఈ విషయాలలో వాళ్లని విమర్శించే రైట్ వీరికి ఉంది. కానీ వైసీపీ నేతలు దేన్ని విమర్శించాలో, దేన్ని విమర్శించకూడదో కూడా తెలియక అందరికీ కోపం తెప్పిస్తున్నారు. మన రాష్ట్రం బాగుపడేలాగా ఏదైనా మార్పు వస్తుందంటే దాన్ని స్వాగతించాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షంలో ఉన్నా సరే మంచి పనులను ప్రజలకు మేలు చేసే వాటినిChandrababu{#}Bihar;Capital;you tube;Leader;Bharatiya Janata Party;Success;Andhra Pradesh;Jagan;CBN;YCPవైసీపీ చేస్తున్న విమర్శలతో అందరూ షాక్ ఇంత మూర్ఖంగా ఉంటారా..?వైసీపీ చేస్తున్న విమర్శలతో అందరూ షాక్ ఇంత మూర్ఖంగా ఉంటారా..?Chandrababu{#}Bihar;Capital;you tube;Leader;Bharatiya Janata Party;Success;Andhra Pradesh;Jagan;CBN;YCPSat, 10 Aug 2024 19:30:00 GMT

వైసీపీ కార్యకర్తలు ఇటీవల కాలంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను విమర్శించడం లేదు. వారు చేసే పాలనా తప్పులను కూడా నిందించడం లేదు. వాస్తవానికి ఈ విషయాలలో వాళ్లని విమర్శించే రైట్ వీరికి ఉంది. కానీ వైసీపీ నేతలు దేన్ని విమర్శించాలో, దేన్ని విమర్శించకూడదో కూడా తెలియక అందరికీ కోపం తెప్పిస్తున్నారు. మన రాష్ట్రం బాగుపడేలాగా ఏదైనా మార్పు వస్తుందంటే దాన్ని స్వాగతించాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షంలో ఉన్నా సరే మంచి పనులను ప్రజలకు మేలు చేసే వాటిని ప్రోత్సహించాలి. కానీ దానివల్ల ఎవరికో పేరు వస్తుంది ఏమో అని ఒక మంచి పనిని వ్యతిరేకించడం చాలా తప్పు. దాని గురించే దుష్ప్రచారం చేయడం మరింత తప్పు.

ఇటీవల రాష్ట్ర రాజధాని అమరావతిలో యూట్యూబ్ ట్రైనింగ్ అకాడమీని ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అకాడమీ యూట్యూబ్ కోసం హై-క్వాలిటీ కంటెంట్‌ని రూపొందించడంలో యువతకు సహాయం చేయడానికి ట్రైనింగ్, సోర్స్‌లు అందిస్తుంది. దీనివల్ల చాలామంది నిరుద్యోగులకు ఒక స్కిల్ అనేది ఏర్పడుతుంది. యూట్యూబ్ అనేది ఈరోజుల్లో డీసెంట్ మంత్లీ శాలరీ అందిస్తోంది. హై క్వాలిటీ వీడియోలు చేసుకుంటే యూట్యూబ్ లో సక్సెస్ అవ్వచ్చు. హాయిగా ఇంట్లోనే కూర్చుని డబ్బు సంపాదించవచ్చు. దీనివల్ల నిరుద్యోగ సమస్య అనేది చాలా తగ్గుతుంది.

 కానీ దీనిని వైసీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వస్తే, దానిని అధికారంలోకి వచ్చాక ఈ ట్రైనింగ్ సెంటర్లను తాము మరింత ఇంప్రూవ్ చేస్తామని చెప్పాలి కానీ దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. వారి విమర్శలు చూస్తుంటే ఎవరైనా సరే ఇంత మూర్ఖంగా ఎలా ఉంటారు అని ప్రశ్నించకుండా ఉండలేరు. యూట్యూబ్ వంటి మంచి కంపెనీలు రాకుండా చేస్తే ఏపీ ప్రజలే నాశనం అవుతారు. ఉద్యోగాలు లేక బీహార్ లో దొంగతనాలు చేసినట్లు దొంగతనాలు పాల్పడతారు. క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ప్రజల కోసమే ఆలోచించడం మంచిది. ఇక జగన్ కూడా పెద్ద మనసు చేసుకొని ఇలాంటి వాటిని స్వాగతించాలి. అప్పుడే ఆయన అసలైన లీడర్ గా ప్రజల్లో పేరు తెచ్చుకుంటారు. ఆయన ఎలాగూ తీసుకురాలేకపోయారు. కనీసం చంద్రబాబు పరిపాలన చూసైనా ఆయన కొన్ని మంచి అభివృద్ధి పనులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>