Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/vinesh0445d51f-92ef-4655-a612-fbe45aca3edf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/vinesh0445d51f-92ef-4655-a612-fbe45aca3edf-415x250-IndiaHerald.jpgవినేష్ పొగాట్.. ఆమె ఒక యోధురాలు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగింది. లైంగిక ఎదురయ్యాయి అంటూ ఎదురవుతున్నాయి అంటూ ధర్నా చేపట్టింది. ఏకంగా ఒలంపిక్స్ లో మెడల్ తో నిలబడాల్సిన వినేష్ పొగాట్.. రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ అర్థించింది. అలాంటి ఈ రెజ్లర్ ఇటీవల ఒలంపిక్స్ లో అందరి మనసులు గెలిచేసింది. ఇక ఎంతోమంది క్రీడాకారులను ఓడిస్తూ ఏకంగా 50 కేజీల రెస్లింగ్ విభాగంలో ఫైనల్స్ వరకు చేరింది. దీంతో ఆమె తప్పకుండా గోల్డ్ మెడల్ సాధించి తీరుతుంది అని అభిమానులు అందరూ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. Vinesh{#}Rajya Sabha;Champion;Indians;septemberవినేష్ పొగాట్ రాజ్యసభకు వెళ్లలేదు.. ఎందుకో తెలుసా?వినేష్ పొగాట్ రాజ్యసభకు వెళ్లలేదు.. ఎందుకో తెలుసా?Vinesh{#}Rajya Sabha;Champion;Indians;septemberSat, 10 Aug 2024 10:15:00 GMTవినేష్ పొగాట్.. ఆమె ఒక యోధురాలు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగింది. లైంగిక ఎదురయ్యాయి అంటూ ఎదురవుతున్నాయి అంటూ ధర్నా చేపట్టింది. ఏకంగా ఒలంపిక్స్ లో మెడల్ తో నిలబడాల్సిన వినేష్ పొగాట్.. రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ అర్థించింది. అలాంటి ఈ రెజ్లర్ ఇటీవల ఒలంపిక్స్ లో అందరి మనసులు గెలిచేసింది. ఇక ఎంతోమంది క్రీడాకారులను ఓడిస్తూ ఏకంగా 50 కేజీల రెస్లింగ్ విభాగంలో ఫైనల్స్ వరకు చేరింది. దీంతో ఆమె తప్పకుండా గోల్డ్ మెడల్ సాధించి తీరుతుంది అని అభిమానులు అందరూ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు.


 కేవలం అభిమానులు మాత్రమే కాదు 130 కోట్ల మంది భారతీయులు కూడా వినేష్ గోల్డ్ గెలిచి భారత్కు తిరిగి రావాలి అని ప్రార్థించారు. కానీ విధి మరోలా తలచింది. ఏకంగా 100 గ్రాముల అధిక బరువు కారణంగా సెమీఫైనల్ గెలిచి ఫైనల్ వెళ్లిన వినేష్ పొగాట్ పై అనర్హత వేటు పడింది. దీంతో ఇండియన్స్ అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఇలా అనర్హత వేటుకు గురైనప్పటికీ.. ఆమె తమ దృష్టిలో మాత్రం ఛాంపియన్ అని ఎంతో మంది సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు.


 అయితే ఇలా ఒలంపిక్స్ లో  అసమాన్యమైన ప్రతిభ కనబరిచి చివరికి అనర్హత వేటుకు గురైన వినేష్ పొగాట్ కు మరింత గౌరవం ఇచ్చే ఆమెను రాజ్యసభకు ఎంపిక చేయాలి అంటూ డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న వయస్సు దృశ్య వినేష్  రాజ్యసభకు వెళ్లలేరు. ఎందుకంటే పెద్దల సభగా పిలుచుకునే రాజ్యసభకు పంపించాలి అంటే కనీస వయస్సు 30 సంవత్సరాలు నిండి ఉండాలి. కానీ ప్రస్తుతం వినేష్ పొగాట్ వయసు 29 సంవత్సరాలు. ఆగస్టు 25 నాటికి ఆమె 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. అయితే సెప్టెంబర్ మూడవ తేదీన రాజ్యసభ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ.. ఆగస్టు 21వ తేదీ నాటికి నామినేషన్ పూర్తవుతుంది. దీంతో వినేష్ పొగాట్ ను రాజ్యసభకు పంపాలి అంటే మాత్రం ఇంకొంత కాలం పాటు వెయిట్ చేయక తప్పదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>