PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gitta-jayasurya011b9204-1bc7-420b-9b61-c65cb21ebdc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gitta-jayasurya011b9204-1bc7-420b-9b61-c65cb21ebdc0-415x250-IndiaHerald.jpgఉమ్మడి కర్నూలు జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాలు వైసీపీకి అనుకూల నియోజకవర్గాలు కాగా 2024 ఎన్నికల ఫలితాలు ఈ లెక్కల్ని కొంతమేర మార్చేశాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా 80 శాతం నియోజకవర్గాల్లో కూటమి సత్తా చాటింది. అయితే గ్రూప్ రాజకీయాలు టీడీపీ నేతల పరువు తీస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నేతల చేరికల వల్ల కూటమి బలపడుతున్నా గ్రూప్ రాజకీయాల వల్ల కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. gitta jayasurya{#}dr rajasekhar;jayasurya music;Parliment;war;Nandyala;Nandikotkur;Kurnool;politics;Party;TDP;CBNరసవత్తరంగా నందికొట్కూరు రాజకీయం.. బైరెడ్డి, జయసూర్యలలో ఎవ్వరూ తగ్గట్లేదుగా!రసవత్తరంగా నందికొట్కూరు రాజకీయం.. బైరెడ్డి, జయసూర్యలలో ఎవ్వరూ తగ్గట్లేదుగా!gitta jayasurya{#}dr rajasekhar;jayasurya music;Parliment;war;Nandyala;Nandikotkur;Kurnool;politics;Party;TDP;CBNFri, 09 Aug 2024 08:08:00 GMTఉమ్మడి కర్నూలు జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాలు వైసీపీకి అనుకూల నియోజకవర్గాలు కాగా 2024 ఎన్నికల ఫలితాలు ఈ లెక్కల్ని కొంతమేర మార్చేశాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా 80 శాతం నియోజకవర్గాల్లో కూటమి సత్తా చాటింది. అయితే గ్రూప్ రాజకీయాలు టీడీపీ నేతల పరువు తీస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నేతల చేరికల వల్ల కూటమి బలపడుతున్నా గ్రూప్ రాజకీయాల వల్ల కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.
 
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు కాగా 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన గిత్త జయసూర్య గెలిచారు. గిత్త జయసూర్య తెలుగుదేశం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. అయితే నియోజకవర్గంలో తమ మాట పైచేయి సాధించాలని శివానందరెడ్డి, జయసూర్య పట్టుబడుతుండటం గమనార్హం.
 
మరోవైపు తమ మాటే నెగ్గాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పట్టుబడుతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో గ్రూప్ వార్ వల్ల పార్టీ క్యాడర్ సైతం రెండుగా చీలిపోయిన పరిస్థితి నెలకొంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన కౌన్సిలర్లు జయసూర్య గూటికి చేరుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు శబరి నంద్యాల ఎంపీ కావడంతో ఆయనకు ప్రాధాన్యత ఎక్కువగానే ఉంది.
 
గ్రూపు రాజకీయాల వల్ల పార్టీ తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుంటే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయి. చంద్రబాబు ఇలాంటి చిన్నచిన్న తగాదాల విషయంలో దృష్టి పెట్టకపోతే మాత్రం పార్టీ తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒకే పార్టీ నేతలు గొడవ పడితే పార్టీకి ఏ స్థాయిలో నష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో అయినా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>