MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh-babu31b64590-ccb1-4e73-8fca-8d05f936224a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh-babu31b64590-ccb1-4e73-8fca-8d05f936224a-415x250-IndiaHerald.jpgహారిక హాసిని విడుదల చేసిన మహేష్ పోస్టర్ కి పిచ్చ ఫిదా అవుతున్న ఫ్యాన్స్? నేడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు అనే ట్యాగ్ అయితే ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది.ఇక మహేష్ తో సినిమాలు చేసిన నిర్మాణ సంస్థలు అయితే స్పెషల్ పోస్టర్స్ తో విషెస్ అయితే అందించారు. ఈ సందర్భంగా హారికా అండ్ హాసిని కూడా మహేష్ బాబుకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో మహేష్Mahesh Babu{#}Rajamouli,trivikram srinivas,Thriller,Rajani kanth,mahesh babu,CBN,Posters,Tollywood,Hero,Cinemaహారిక హాసిని విడుదల చేసిన మహేష్ పోస్టర్ కి పిచ్చ ఫిదా అవుతున్న ఫ్యాన్స్?హారిక హాసిని విడుదల చేసిన మహేష్ పోస్టర్ కి పిచ్చ ఫిదా అవుతున్న ఫ్యాన్స్?Mahesh Babu{#}Rajamouli,trivikram srinivas,Thriller,Rajani kanth,mahesh babu,CBN,Posters,Tollywood,Hero,CinemaFri, 09 Aug 2024 18:06:00 GMT నేడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు అనే ట్యాగ్ అయితే ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది.ఇక మహేష్ తో సినిమాలు చేసిన నిర్మాణ సంస్థలు అయితే స్పెషల్ పోస్టర్స్ తో విషెస్ అయితే అందించారు. ఈ సందర్భంగా హారికా అండ్ హాసిని కూడా మహేష్ బాబుకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో మహేష్ రెండు చేతుల్లో రెండు ఆయుధాలు పట్టుకొని పవర్ఫుల్ లుక్‌తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులు సూపర్ అంటూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఆ మధ్య రక్తపాతకథతో కూడిన మూవీ అనౌన్స్ చేయబడింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ రద్దు చేయబడింది, దాని స్థానంలో 'గుంటూరు కారం' అనే సినిమా తెరకెక్కింది.
కమర్శియల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయినా కానీ స్టోరీ విషయంలో మాత్రం అంచనాలు మాత్రం అందుకోలేకపోయింది. కానీ మహేష్ యాక్టింగ్, డాన్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పోస్టర్ మహేష్ అభిమానుల్లో కొంత నిరాశ కలిగించింది. "మహేష్‌ని ఇలా గంభీరంగా చూపించే సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమా ఎందుకు రద్దు చేసి, 'గుంటూరు కారం' తీసుకున్నారు?" అంటూ ఒక ఫ్యాన్ తన ఆవేదన వ్యక్తం చేశారు.మహేష్ బాబు నుంచి ఇలాంటి ఇన్టెన్స్ యాక్షన్ మూవీని కోరుకుంటున్న అభిమానులు, ఈ కొత్త పోస్టర్ చూసి మాత్రం నిరాశను పంచుకున్నారు. 'గుంటూరు కారం' సినిమా ఒక మామూలు కమర్షియల్ సినిమా కాని యాక్షన్ థ్రిల్లర్ రూపంలో మహేష్‌ని చూడాలని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం పుట్టినరోజు సందర్బంగా మహేష్ ఈ లుక్ పోస్టర్‌తో తన అభిమానులను ఆకట్టుకున్నారు.ఇక సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>