EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan800a5056-250e-495b-acc8-759475ccae93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan800a5056-250e-495b-acc8-759475ccae93-415x250-IndiaHerald.jpgఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి చిన్నపాటి సందడి నెలకొంది. యఅయితే ఇది కచ్ఛితంగా తాజా రాజకీయాల్లో కీలకమైన అంశంగానే ఉంది. ప్రధానంగా మెజార్టీ లేకపోయినా.. టీడీపీ పోటీకి దిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో జగన్ ఎంట్రీ తో ఎన్నికల స్వభావం మారిపోయింది. ఈ సందర్భంగా విలువలు, విశ్వసనీయతపై మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. తాజాగా.. విశాఖ జిల్లాలోని వైసీపీ తరఫున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత, మాజీ సjagan{#}Vishakapatnam;CBN;TDP;Jagan;YCP;Manam;local language;Party;CMఘోరంగా ఓడినా.. జగన్ ధీమా అదే?ఘోరంగా ఓడినా.. జగన్ ధీమా అదే?jagan{#}Vishakapatnam;CBN;TDP;Jagan;YCP;Manam;local language;Party;CMFri, 09 Aug 2024 08:00:00 GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి చిన్నపాటి సందడి నెలకొంది. యఅయితే ఇది కచ్ఛితంగా తాజా రాజకీయాల్లో కీలకమైన అంశంగానే ఉంది. ప్రధానంగా మెజార్టీ లేకపోయినా.. టీడీపీ పోటీకి దిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.  ఈ సమయంలో జగన్ ఎంట్రీ తో ఎన్నికల స్వభావం మారిపోయింది.


ఈ సందర్భంగా విలువలు, విశ్వసనీయతపై మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. తాజాగా.. విశాఖ జిల్లాలోని వైసీపీ తరఫున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిరాయింపులు జరుగుతాయనే చర్చ జరుగుతున్న వేళ… విలువలు, విశ్వసనీయత అనేవి అటు వ్యక్తిగత జీవితంలోను, ఇటు రాజకీయాల్లోను చాలా ముఖ్యమని తెలిపారు.


ఈ సందర్భంగా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేకపోతే.. కుటుంబ సభ్యులు కూడా గౌరవించరని చెప్పారు. ఈ సందర్భంగా 2014,2019, 2024 ఎన్నికల్లొ తాను ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇవ్వాలని చాలా మంది తనపై ఒత్తిడి తెచ్చారని కానీ.. దానికి నేను అంగీకరించలేదు.. అందుకే ఆ నాడు ఓటమి పాలయ్యామని చెప్పుకొచ్చారు.


అప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే 2019లో ఓడించారని.. గుర్తు చేశారు. 2014 మాదిరిగానే ఇప్పుడు కూడా చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చారని.. 10శాతం మంది ప్రజలు అధికంగా వాటిని నమ్మడం వల్లే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. 2019లో ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు మనం ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లగలమని.. చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు వైసీపీ నేతల్లా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. అలా వెళ్లిన నాయకులను ప్రజలు సూపర్ సిక్స్ గురించి అడిగితే ఏం సమాధానం చెబుతారు అని నిలదీశారు. ఇదే వైసీపీకి, టీడీపీ ఉన్న తేడా అని స్పష్టం చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>