PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/congress3b4a7aa0-a1db-41d4-9a22-b1f67fc5bf06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/congress3b4a7aa0-a1db-41d4-9a22-b1f67fc5bf06-415x250-IndiaHerald.jpgదీనికి తోడు కేసులు గోల ఉండనే ఉంది .. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అంటే తనకు గిట్టకపోయినా ఇప్పుడు అదే కాంగ్రెస్తో కలిసి ప్రయాణించక తప్పని పరిస్థితి. తాజాగా ఇండియా కూటమికి మరింత దగ్గర ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ కూడా ఇండియా కుటుంబంలో భాగస్వామి అవతారన్న ప్రచారానికి ఇటీవల ఢిల్లీలో చేసిన ధర్నా సందర్భంగా జరిగిన పరిణామాలు బలం చేకూర్చాయి.congress{#}Congress;Jagan;YCPకాంగ్రెస్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా జ‌గ‌న్ మ‌రో అడుగు..?కాంగ్రెస్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా జ‌గ‌న్ మ‌రో అడుగు..?congress{#}Congress;Jagan;YCPFri, 09 Aug 2024 08:52:43 GMT- వ‌క్ఫ్ బోర్డు బిల్లు విష‌యంలో ఇండియా కూట‌మి వైసీపీ ఫుల్ స‌పోర్ట్

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .

తనకు బద్ధ శత్రువు అయిన తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ? అయితే ఎన్డీఏ కూటమిలో చేరి బిజెపికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దగ్గరయ్యారు. ఆ అప్పటినుంచి జగన్ కు బిజెపి అన్నా మోడీ అన్నా కోపం పీక‌ల్లో తులో కనిపిస్తోంది. అసలే జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు .. పైగా కష్టాల్లో ఉన్నారు. దీనికి తోడు కేసులు గోల ఉండనే ఉంది .. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అంటే తనకు గిట్టకపోయినా ఇప్పుడు అదే కాంగ్రెస్తో కలిసి ప్రయాణించక తప్పని పరిస్థితి. తాజాగా ఇండియా కూటమికి మరింత దగ్గర ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ కూడా ఇండియా కుటుంబంలో భాగస్వామి అవతారన్న ప్రచారానికి ఇటీవల ఢిల్లీలో చేసిన ధర్నా సందర్భంగా జరిగిన పరిణామాలు బలం చేకూర్చాయి.


ఇండియా కుటుంబంలో కీలకంగా ఉన్న సమాజ్ వాది పార్టీ ఉద్దవ్ థాకరే - శివసేన నుంచి ఎంపీ సంజయ్ రౌత్ తో వచ్చి జగన్ కు మద్దతు ఇచ్చారు. వాస్తవానికి జగన్ మోడీకి దూరం జరగటానికి అస్సలు ఇష్టపడరు. కానీ చంద్రబాబు వైసీపీని దగ్గరకు రానివ్వరని జగన్ కు తెలుసు .. అలా అని జగన్ డైరెక్ట్ గా సోనియా గాంధీ - రాహుల్ గాంధీతో మాట్లాడలేరు .. అందుకే మధ్యవర్తిగా అఖిలేష్ యాదవ్ ను పెట్టుకుని జగన్ రాజకీయం చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా లోక్సభలో కేంద్రం తెచ్చిన వ‌క్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఇండియా కూటమితో వైసిపి జత కట్టింది.


ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే బిల్లును పార్లమెంటు ముందుకు పంపాలి అన్న ఇండియా కూటమి వాదనాలతో వైసిపి ఏకీభవిస్తుందని చెప్పారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>