Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobitha04eee4ff-96b5-40d8-b177-b47211937487-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobitha04eee4ff-96b5-40d8-b177-b47211937487-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. అదే అక్కినేని హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం గురించి. గత కొన్ని నెలల నుంచి కూడా ఈ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి. అయితే ఇద్దరు కలిసి ఎన్నో టూర్లకు వెళ్లడంతో ఈ వార్తలు నిజమే అని అందరూ అనుకున్నారు. కానీ తమ మధ్య ఏమీ లేదు అంటూ గతంలో ఇద్దరు కూడా స్పందించారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకొని సర్ ప్రైస్ ఇచ్చేసారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరShobitha{#}Anurag Kashyap;vidya;Nijam;Tollywood;School;Heroine;shobitha;Akkineni Nagarjuna;Chaitanya;naga;Naga Chaitanya;News;Telugu;Cinema;Heroశోభిత ఆస్తులు చైతన్య కంటే ఎక్కువేనా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?శోభిత ఆస్తులు చైతన్య కంటే ఎక్కువేనా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?Shobitha{#}Anurag Kashyap;vidya;Nijam;Tollywood;School;Heroine;shobitha;Akkineni Nagarjuna;Chaitanya;naga;Naga Chaitanya;News;Telugu;Cinema;HeroFri, 09 Aug 2024 08:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. అదే అక్కినేని హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం గురించి. గత కొన్ని నెలల నుంచి కూడా ఈ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి. అయితే ఇద్దరు కలిసి ఎన్నో టూర్లకు వెళ్లడంతో ఈ వార్తలు నిజమే అని అందరూ అనుకున్నారు. కానీ తమ మధ్య ఏమీ లేదు అంటూ గతంలో  ఇద్దరు కూడా స్పందించారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకొని సర్ ప్రైస్ ఇచ్చేసారు.


 కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది అని చెప్పాలి. ఇక ఈ ఫోటోలని అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలో శోభిత, చైతన్య జంట సాంప్రదాయ దుస్తులలో ఎంతో ఆనందంగా కనిపించారు. అయితే హీరోయిన్ గా శోభితో దూళిపాళ్ల ఇండస్ట్రీలో దాదాపు అందరూ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది  కానీ వ్యక్తిగత జీవితం ఏంటి అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ప్రస్తుతం నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత అక్కినేని కోడలుగా రాబోయే ఈ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.


 అయితే శోభితకి నాగచైతన్యతో పోల్చి చూస్తే ఎక్కువే ఆస్తులు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇలాంటి వార్తల్లో నిజం లేదట. శోభిత తండ్రి వేణుగోపాలరావు మర్చంట్ నేవీ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటారట. ఇక తల్లి కామాక్షి ప్రైమరీ స్కూల్ టీచర్. ముమ్మాటికి సాదాసీదా తెలుగు కుటుంబమే అని చెప్పాలి.   అయితే అక్కినేని వారి ఆస్తులతో పోల్చి చూస్తే శోభిత ఆస్తుల విలువ చాలా తక్కువ. నాగచైతన్య కేవలం శోభితో జీవితం ఆనందంగా ఉంటుంది అని మాత్రమే ఆలోచించి పెళ్లికి సిద్ధమయ్యాడు. తన తండ్రికి నేవీలో ట్రాన్స్ఫర్ కావడంతో చిన్న వయసులోనే ముంబైకి చేరుకుంది శోభిత. ఇక అక్కడ విద్య పూర్తి చేసింది. ఇక తర్వాత ఆ మోడలింగ్ పై ఆసక్తితో 2003లో జరిగిన మిస్ ఎర్త్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక 2016లో సినిమా రంగంలో అడుగు పెట్టింది. తొలిసారి అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవన్ 2.0 సినిమాలో నటించింది. తెలుగులో గూడా చారి, మేజర్ లాంటి సినిమాలలో నటించి ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు  చైతన్యతో పెళ్లికి సిద్ధమైన నేపథ్యంలో ఆమె కెరియర్ కంటే వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>