PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sathya-kumar-yadav3731a968-377c-4d6f-82ad-a9e9bcb08ac8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sathya-kumar-yadav3731a968-377c-4d6f-82ad-a9e9bcb08ac8-415x250-IndiaHerald.jpgధర్మవరం ఎమ్మెల్యే బిజెపి నేత ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్య కుమార్ యాదవ్ తాజాగా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన డయాలసిస్ కేంద్రాన్ని తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభిస్తూ.. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. SATHYA KUMAR YADAV{#}Nellore;Kumaar;satya;Minister;Government;YCP;MLAప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి.. ధర్మవరం ఎమ్మెల్యే కీలక నిర్ణయం..!ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి.. ధర్మవరం ఎమ్మెల్యే కీలక నిర్ణయం..!SATHYA KUMAR YADAV{#}Nellore;Kumaar;satya;Minister;Government;YCP;MLAFri, 09 Aug 2024 12:58:17 GMTధర్మవరం ఎమ్మెల్యే బిజెపి నేత ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్య కుమార్ యాదవ్ తాజాగా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన డయాలసిస్ కేంద్రాన్ని తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభిస్తూ.. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు.

నెల్లూరు హాస్పిటల్ కి ఆరు డయాలసిస్ యూనిట్లను  లయన్స్ క్లబ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై ఇప్పటికే  ప్రత్యేక దృష్టి సారించాము. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుంది. దేశంలో మూడు కోట్ల 40 లక్షల మంది మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారికి మెరుగైన సేవలు,  అందులోను ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా అందివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంటూ సత్యకుమార్ పేర్కొన్నారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని , ఇక దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి సత్య కుమార్ తెలిపారు. గత ఐదేళ్లలో వైద్య రంగాన్ని వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని తెలిపిన ఆయన , సెక్యూరిటీ , శానిటైజేషన్ లో అవకతవక్కలకు పాల్పడ్డారు అంటూ చెప్పుకొచ్చారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారని రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో వైద్య సేవలు అందించడానికి మేము మరింత కృషి చేస్తామని మంత్రి సత్య కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సత్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా డయాలసిస్ వ్యాధిగ్రస్తుల కోసం ఇలాంటి వినూత్నమైన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే అన్ని ప్రాంతాలలో కూడా డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి మెరుగైన వైద్యం కోసం కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>