MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఆమధ్య ఆంద్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధి శిల్పా రవికి ప్రచారం చేయడంతో మెగా అభిమానులు అంతా బన్నీ పై మండిపడ్డారు. ఎన్నికలలో పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ప్రచారానికి రాకుండా బన్నీ శిల్పా రవి కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం ఏమిటి అంటూ మెగా అభిమానులు అంతా బన్నీ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక నెగిటివ్ కామెంట్స్ పెట్టిన విషయం తెలిసిందే. దీనితో మళ్ళీ మెగా అభిమానులలో చీలిక ఏర్పడి కొంతమంది చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అభిమానులుగా కొనసాగుతూ ఉంటే alluarjun{#}ravi anchor;Nagababu;Bunny Vas;shilpa;kalyan ram;Allu Arjun;Chiranjeevi;media;Cinema;pithapuram;kalyan;YCPనాగబాబు కామెంట్స్ తో జోష్ లో అల్లు అర్జున్ అభిమానులు !నాగబాబు కామెంట్స్ తో జోష్ లో అల్లు అర్జున్ అభిమానులు !alluarjun{#}ravi anchor;Nagababu;Bunny Vas;shilpa;kalyan ram;Allu Arjun;Chiranjeevi;media;Cinema;pithapuram;kalyan;YCPFri, 09 Aug 2024 08:09:00 GMTఆమధ్య ఆంద్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధి శిల్పా రవికి ప్రచారం చేయడంతో మెగా అభిమానులు అంతా బన్నీ పై మండిపడ్డారు. ఎన్నికలలో పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ప్రచారానికి రాకుండా బన్నీ శిల్పా రవి కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం ఏమిటి అంటూ మెగా అభిమానులు అంతా బన్నీ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక నెగిటివ్ కామెంట్స్ పెట్టిన విషయం తెలిసిందే.



దీనితో మళ్ళీ మెగా అభిమానులలో చీలిక ఏర్పడి కొంతమంది చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అభిమానులుగా కొనసాగుతూ ఉంటే మరికొందరు మాత్రమే బన్నీ అభిమానులుగా మారిపోవడంతో మెగా అభిమానులలో వర్గాలు ఏర్పడతాయా అన్న సందేహాలు కొందరికి వచ్చాయి. దీనికితోడు అప్పట్లో నాగబాబు బన్నీ వైసీపీ పార్టీకి ప్రచారం చేయడానికి వెళ్లినందుకు పరోక్షంగా విమర్శిస్తూ పెట్టి ఆతరువాత తీసేసిన ట్వీట్ పెను దుమారం సృష్టించింది.



ఈవ్యవహారంతో మళ్ళీ మెగా కాంపౌండ్ అల్లు కాంపౌండ్ ల దూరం పెరిగిందా అంటూ చాలమందికి సందేహాలు వచ్చాయి. ఆమధ్య బన్నీకి అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా కాంపౌండ్ అల్లు కాంపౌండ్ ల మధ్య ఎటువంటి భేధాభిప్రాయాలు లేవు అని చెప్పిన విషయం తెలిసిందే.



ఈ సంఘటన జరిగి కొన్ని రోజులు కాకుండానే నాగబాబు బన్నీ ఉద్దేశిస్తూ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈమధ్య నాగబాబు సోషల్ మీడియాలో మెగా అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సందర్భంలో ఒక అభిమాని బన్నీ పై ‘మీ అభిప్రాయం ఏమిటి’ అంటూ ప్రశ్నించాడు. దీనిపై నాగబాబు స్పందిస్తూ బన్నీ చాల కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని అతను నటించిన ‘పుష్ప 2’ సినిమా కోసం తాను ఎదురు చూస్తున్నాను అంటూ చేసిన పాజిటివ్ కామెంట్స్ అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ ల మధ్య సయోధ్య కుదిరిన విషయాన్ని పరోక్షంగా తెలియచేస్తోంది..










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>