MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntrae46c9e8-fab0-4f45-a729-cb022ef34cc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntrae46c9e8-fab0-4f45-a729-cb022ef34cc7-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ప్రారంభంలో ఆది అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. వినాయక్ , ఎన్టీఆర్ తో మొదట ఆది కాకుండా మరో కథతో సినిమా చేయాలి అనుకున్నాడట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. అసలు వినాయక్ , ఎన్టీఆర్ తో మొదట అనుకున్న కథ ఏమిటి ..? అది ఎందుకు కుదరలేదు అనే వివరాలను తెలుసుకుందాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరjr ntr{#}keerthi chawla;Kodali Nani;v v vinayak;AdiNarayanaReddy;Love Story;Mass;Jr NTR;NTR;Darsakudu;Cinema;Directorఎన్టీఆర్ తో వినాయక్ మొదట అనుకున్న కథ అదే.. మరి ఆది ఎలా వచ్చిందో తెలుసా..?ఎన్టీఆర్ తో వినాయక్ మొదట అనుకున్న కథ అదే.. మరి ఆది ఎలా వచ్చిందో తెలుసా..?jr ntr{#}keerthi chawla;Kodali Nani;v v vinayak;AdiNarayanaReddy;Love Story;Mass;Jr NTR;NTR;Darsakudu;Cinema;DirectorFri, 09 Aug 2024 13:30:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ప్రారంభంలో ఆది అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. వినాయక్ , ఎన్టీఆర్ తో మొదట ఆది కాకుండా మరో కథతో సినిమా చేయాలి అనుకున్నాడట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. అసలు వినాయక్ , ఎన్టీఆర్ తో మొదట అనుకున్న కథ ఏమిటి ..? అది ఎందుకు కుదరలేదు అనే వివరాలను తెలుసుకుందాం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమాను తెరకెక్కించే అవకాశం దర్శకుడు వినాయక్ వచ్చింది. ఇక వినాయక్ , ఎన్టీఆర్ తో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ని చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా తన దగ్గర ఉన్న ఒక లవ్ స్టోరీ కథను కూడా ఎన్టీఆర్ కి వినిపించాడట. ఆ కథ కూడా ఎన్టీఆర్ కి బాగా నచ్చడంతో ఈ కథతో సినిమా చేద్దాం సార్ అని ఎన్టీఆర్ కూడా వినాయక్ కి చెప్పాడట. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ కి ఎంతో మంచి స్నేహితుడు అయినటువంటి కొడాలి నాని , ఎన్టీఆర్ తో లవ్ స్టోరీ సినిమా కాకుండా ఒక మంచి యాక్షన్ సినిమా తీయి అలాంటి సినిమా అయితే బాగా ఉంటుంది అని వినాయక్ తో అన్నాడట. దానితో వినాయక్ ఆయన మాటలకు కన్విన్స్ అయ్యి ఒక మాస్ కథను రాయాలి అనుకున్నాడట.

అందులో భాగంగా ఆది కథను తయారు చేశాడట. ఇక ఆ తర్వాత ఆది కథను ఎన్టీఆర్ కి వినిపించగా ఆ కథ అద్భుతంగా నచ్చడంతో ఎన్టీఆర్ కోసం వినాయక్ రాసుకున్న లవ్ స్టోరీ పక్కకు వెళ్లి ఆది సినిమా లైన్ లోకి వచ్చిందట. ఈ సినిమా కోసం అనేక మంది హీరోయిన్లను మొదట అనుకున్న వినాయక్ ఆఖరుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా కీర్తి చావ్లా ను సెలెక్ట్ చేశాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>