PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn72c101dd-0099-429d-a4c5-b1cbf403cf0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn72c101dd-0099-429d-a4c5-b1cbf403cf0c-415x250-IndiaHerald.jpgఅలాగే పార్టీలు ఇచ్చే హామీలు తక్కువే .. ఇక ఆంధ్రప్రదేశ్లో కేవలం సంక్షేమ పాలన చేసిన వైయస్ జగన్ ను రాజకీయంగా దెబ్బతీయయాలంటే ముల్లును ముల్లుతోనే తీయాలని చంద్రబాబు వ్యూహం రచించారు. ఐదేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ పూర్తిగా అభివృద్ధి ని విస్మ‌రించి సంక్షేమం పై కాన్‌సంట్రేష న్ చేస్తూ వ‌చ్చారు.CBN{#}Jagan;YCP;CBNబాబును చూపించి జ‌గ‌న్‌పై ఒత్తిడి చేస్తోన్న వైసీపీ టాప్ లీడ‌ర్స్ ..?బాబును చూపించి జ‌గ‌న్‌పై ఒత్తిడి చేస్తోన్న వైసీపీ టాప్ లీడ‌ర్స్ ..?CBN{#}Jagan;YCP;CBNFri, 09 Aug 2024 09:33:44 GMT- బాబులా అబ‌ద్ధ‌పు హామీలు ఇవ్వ‌లేనంటోన్న జ‌గ‌న్
- చేయ‌ని ప‌నులు చెప్ప‌డం త‌న వ‌ల్ల కాద‌ని ప్ర‌క‌ట‌న‌

( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ ) .

ఎన్నికల సమయంలో అధికారంలోకి రావాలంటే ఓటర్ లకు తాయిలాలు తప్పవు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇదే పరిస్థితి .. అయితే ఒక్కో రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు ఒక్కోరకంగా ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎన్నికల ఖర్చు ... అలాగే పార్టీలు ఇచ్చే హామీలు తక్కువే .. ఇక ఆంధ్రప్రదేశ్లో కేవలం సంక్షేమ పాలన చేసిన వైయస్ జగన్ ను రాజకీయంగా దెబ్బతీయయాలంటే ముల్లును ముల్లుతోనే తీయాలని చంద్రబాబు వ్యూహం రచించారు. ఐదేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ పూర్తిగా అభివృద్ధి ని విస్మ‌రించి సంక్షేమం పై కాన్‌సంట్రేష న్ చేస్తూ వ‌చ్చారు.


అస‌లు దేశంలోనే ఎవ్వ‌రూ జ‌గ‌న్ చేసిన సంక్షేమ పాల‌న చేయ‌లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే జగన్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తానని ఎన్నికలకు ఏడాది ముందు నుంచి చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్రచారం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. జగన్ ఎంత సంక్షేమం అమలు చేసినా ఓటర్ లు సహజంగానే సూపర్ సిక్స్ కు ఆకర్షితులు అయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. అయితే ఈ విషయాన్ని జగన్ తాజాగా బయటపెట్టారు.


నిన్న ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి గెలిచేందుకు జగన్ నిజానిర్దేశం చేశారు. ఈ క్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎన్నికలలో గెలవాలంటే .. చంద్రబాబు లా హామీలు ఇవ్వాలని తనపై ఒత్తిడి చేశారని ... అయితే తాను చేయలేనని తెలిసి కూడా అబద్ధాలు చెప్పలేనన్నారు. అందుకే ప్రజలకు తన శక్తికి మించిన హామీలు ఇవ్వలేదన్నారు. మాట ఇచ్చి చేయలేదనే మాట ప్రజల నుంచి రాకూడదని ఉద్దేశంతో తాను అబద్దాలు చెప్పలేనని జగన్ చెప్పారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>