PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vijayashanthi56bcc2ed-c0a9-4fd6-935d-bd22ee82ca37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vijayashanthi56bcc2ed-c0a9-4fd6-935d-bd22ee82ca37-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి... చాలా దారుణంగా తయారైంది. ఇప్పటివరకు గులాబీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది... కాంగ్రెస్ పార్టీలోకి జారుకున్నారు. అయితే తమ వాటి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు జారిపోకుండా కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనేక... స్కెచ్ లు వేశారు. కానీ ఆ పది మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ మాట పట్టించుకోకుండా... వెంటనే పార్టీ మారిపోయారు. vijayashanthi{#}KCR;Vijayashanti;Parliament;Congress;Telangana;Partyకేసీఆర్‌ కు సలహాదారులుగా విజయశాంతి ?కేసీఆర్‌ కు సలహాదారులుగా విజయశాంతి ?vijayashanthi{#}KCR;Vijayashanti;Parliament;Congress;Telangana;PartyFri, 09 Aug 2024 08:54:00 GMTతెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి... చాలా దారుణంగా తయారైంది. ఇప్పటివరకు గులాబీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది... కాంగ్రెస్ పార్టీలోకి జారుకున్నారు. అయితే తమ వాటి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు జారిపోకుండా కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనేక... స్కెచ్ లు వేశారు. కానీ ఆ పది మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ మాట పట్టించుకోకుండా... వెంటనే పార్టీ మారిపోయారు.



అయితే పార్టీ మారిపోయిన వారిపై... ఫిరాయింపుల కేసు పెట్టింది గులాబీ పార్టీ. ఇలాంటి నేపథ్యంలో... గులాబీ పార్టీకి కీలక సూచనలు చేస్తూ సంచలనం పోస్ట్ పెట్టారు  కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు విజయశాంతి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీని... గతంలో చీల్చి చెండాడేవారు విజయశాంతి. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత... విజయశాంతి లో పూర్తిగా మార్పు వచ్చింది.


అసలు కల్వకుంట్ల చంద్రశేఖర రావును.. ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు విమర్శించలేదు విజయశాంతి. అలాగే గులాబీ పార్టీ నేతలను కూడా ఎక్కడ విమర్శించకుండా.. సూచనలు చేసుకుంటూ ముందుకు వస్తోంది విజయశాంతి. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ... గులాబీ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీ బతకాలని ఆమె కోరుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే తరచూ... కాంగ్రెస్కు వ్యతిరేకంగా గులాబీ పార్టీకి సపోర్ట్ గా పోస్టులు పెడుతోంది విజయశాంతి.


అయితే లేటెస్ట్ గా... కెసిఆర్ కు మరో సూచన చేసింది విజయశాంతి. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల గురించి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసలు ఆలోచించకూడదని కోరింది. భవిష్యత్తులో గులాబీ పార్టీని.. టిఆర్ఎస్ పార్టీగా మార్చాలని ఆమె ఇండైరెక్టుగా చెప్పింది. అలాగే ఉద్యమ కాలంలో ఉన్న నేతలను... కాపాడుకోవాలని సూచనలు చేసింది.  గతంలో ఉన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీని మార్చాలని వెల్లడించింది విజయశాంతి. అప్పుడే గులాబీ పార్టీ సక్సెస్ అవుతుందని తెలిపింది. మరి దీనిపై కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>