TechnologyChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/prapanchamlo-medallu-marchestaru7fba5561-5467-4312-b81e-4750461509aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/prapanchamlo-medallu-marchestaru7fba5561-5467-4312-b81e-4750461509aa-415x250-IndiaHerald.jpgమానవ మెదడులో ఎలక్ర్టానిక్ చిప్ ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. తాజాగా మరో వ్యక్తికి చిప్ ను అమర్చినట్లు న్యూరాలింక్ సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయంగా ఉండేలా ఈ డివైజ్ ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. రెండో వ్యక్తి మెదడులో అమర్చిన చిప్ లో దాదాపు 400 ఎలక్ర్టోడ్లు చురుగ్గా పనిచేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. అతనికి ఎప్పుడు శస్త్ర చికిత్స చేశారు సహా ఇతర వివరాలేమీ బయట పెట్టలేదు. క్లినికల్ ట్రయిల్స్ లో భాగంగా ఈ ఏడాది చివరికల్nuralink{#}GEUM;January;American Samoaఇక ముందు ముందు.. మనిషి మెదడు కూడా మార్చేస్తారా?ఇక ముందు ముందు.. మనిషి మెదడు కూడా మార్చేస్తారా?nuralink{#}GEUM;January;American SamoaFri, 09 Aug 2024 20:30:00 GMTమానవ మెదడులో ఎలక్ర్టానిక్ చిప్ ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. తాజాగా మరో వ్యక్తికి చిప్ ను అమర్చినట్లు న్యూరాలింక్ సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయంగా ఉండేలా ఈ డివైజ్ ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.  



రెండో వ్యక్తి మెదడులో అమర్చిన చిప్ లో దాదాపు 400 ఎలక్ర్టోడ్లు చురుగ్గా పనిచేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. అతనికి ఎప్పుడు శస్త్ర చికిత్స చేశారు సహా ఇతర వివరాలేమీ బయట పెట్టలేదు. క్లినికల్ ట్రయిల్స్ లో భాగంగా ఈ ఏడాది చివరికల్లా మరో 8 మందికి చిప్ ను అమర్చనున్నట్లు మస్క్ ధ్రువీకరించారు. ఓ పాడ్ కాస్ట్ లో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. ఇదే కార్యక్రమంలో తొలి చిప్ ను అందుకున్న వ్యక్తి నోలాండ్ ఆర్బాగ్ తో పాటు న్యూరాలింక్ కు చెందిన ముగ్గురు ఉన్నతోద్యుగులు పాల్గొన్నారు.


చిప్ ను అమర్చే విధానం, రోబోతో చేసే శస్త్ర చికిత్సకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. చిప్ అమర్చడానికి ముందు ట్యాబ్లెట్ను ఆపరేట్ చేయడానికి నోటితో ప్రత్యేక స్టిక్ ఉపయోగించాల్సి వచ్చేదని ఆర్బాగ్ వివిరించారు. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదని తెలిపారు. చిప్ అమర్చిన తొలినాళ్లలో ఆర్బాగ్ కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. ఎలక్ర్డోడ్లలో కొన్ని మెదడు నుంచి బయటకు వచ్చేశాయి.


ఈ లోపాన్ని ముందే పసిగట్టిన న్యూరాలింక్ సమస్యను సమర్థంగా పరిష్కరించింది. కంప్యూటర్ ఆపరేట్ చేసే విషయంలో ఆర్బాగ్ రికార్డు నెలకొల్పాడని మస్క్ వెల్లడించారు. మానవ మెదడులో తొలి చిప్ ను విజయవంతంగా అమర్చినట్లు జనవరి చివర్లో న్యూరాలింక్ ప్రకటించింది. కంప్యూటర్ తో మానవ మెదడు సమన్వయం చేసుకొని బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ ఫేస్ ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్ చిప్ ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైందని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు. దీని సాయంతో ఓ కోతి పాంగ్ వీడియో గేమ్ ఆడినట్లు వెల్లడించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>