MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobitha9ae30926-257d-4892-aa70-d888916ee3d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobitha9ae30926-257d-4892-aa70-d888916ee3d7-415x250-IndiaHerald.jpgనటి శోభిత ధూళిపాళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఎక్కువ శాతం తెలుగులో అడవి శేషు హీరోగా రూపొందిన సినిమాలలో శోబిత నటించింది. ఈ బ్యూటీ మొదటగా తెలుగులో అడవి శేషు హీరోగా రూపొందిన గూడచారి సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ అడవి శేషు హీరోగా రూపొందిన మేజర్ అనే మరో తెలుగు సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ shobitha{#}Anil Kapoor;Mani Ratnam;nag ashwin;Prabhas;Wife;vijay kumar naidu;Tamil;Hindi;Kannada;BEAUTY;shobitha;Naga Chaitanya;Cinema;India;Teluguశోభిత : కల్కి సినిమాకి ఈమెకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?శోభిత : కల్కి సినిమాకి ఈమెకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?shobitha{#}Anil Kapoor;Mani Ratnam;nag ashwin;Prabhas;Wife;vijay kumar naidu;Tamil;Hindi;Kannada;BEAUTY;shobitha;Naga Chaitanya;Cinema;India;TeluguFri, 09 Aug 2024 10:52:00 GMTనటి శోభిత ధూళిపాళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఎక్కువ శాతం తెలుగులో అడవి శేషు హీరోగా రూపొందిన సినిమాలలో శోబిత నటించింది. ఈ బ్యూటీ మొదటగా తెలుగులో అడవి శేషు హీరోగా రూపొందిన గూడచారి సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ అడవి శేషు హీరోగా రూపొందిన మేజర్ అనే మరో తెలుగు సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది.

మూవీ పాన్ ఇండియా సినిమాగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈమె కొంత కాలం క్రితం ఇది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో ఈమె అనిల్ కపూర్ కి భార్య పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ఈమె అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించింది.

ఇకపోతే తాజాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఏ సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇకపోతే ఈ సినిమాలో కూడా ఈమె భాగం అయింది. కల్కి సినిమాలో ఈమె ఎలా భాగం అయ్యింది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ మూవీ లో దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే కి ఈమె వాయిస్ ఇచ్చింది. ఇలా ఈమె కల్కి సినిమాలో భాగం అయింది. ఇక తాజాగా నాగ చైతన్య కు శోభిత కు ఎంగేజ్మెంట్ జరిగింది. మరికొన్ని రోజుల్లోనే వీరి వివాహం కూడా జరగబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>