PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sujana-chowdary9dbb4dde-2d56-4ab6-a0c6-27e70399d07a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sujana-chowdary9dbb4dde-2d56-4ab6-a0c6-27e70399d07a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తైంది. అయితే రోజులు గడిచే కొద్దీ నేతల మధ్య విబేధాలు పెరుగుతున్నాయి. అటు సుజనా చౌదరి ఇటు బుద్ధా వెంకన్న కూటమి నేతలే అయినా ఇద్దరి మధ్య ఏర్పడిన అగాధం పార్టీ నేతలను తెగ టెన్షన్ పెడుతోంది. సుజనా బుద్ధా వెంకన్న మధ్య అగాధం పెరుగుతోందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. sujana chowdary{#}Sri Venkateswara swamy;Sujana Choudary;Bharatiya Janata Party;TDP;MLA;Partyబెజవాడలో భగ్గుమన్న విబేధాలు.. సుజనా బుద్ధా వెంకన్న మధ్య అగాధం పెరుగుతోందిగా!బెజవాడలో భగ్గుమన్న విబేధాలు.. సుజనా బుద్ధా వెంకన్న మధ్య అగాధం పెరుగుతోందిగా!sujana chowdary{#}Sri Venkateswara swamy;Sujana Choudary;Bharatiya Janata Party;TDP;MLA;PartyFri, 09 Aug 2024 08:40:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తైంది. అయితే రోజులు గడిచే కొద్దీ నేతల మధ్య విబేధాలు పెరుగుతున్నాయి. అటు సుజనా చౌదరి ఇటు బుద్ధా వెంకన్న కూటమి నేతలే అయినా ఇద్దరి మధ్య ఏర్పడిన అగాధం పార్టీ నేతలను తెగ టెన్షన్ పెడుతోంది. సుజనా బుద్ధా వెంకన్న మధ్య అగాధం పెరుగుతోందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
బీజేపీ ఎమ్మెల్యే అయిన సుజనా చౌదరి చెప్పిన విధంగా అధికారుల బదిలీలు జరగడంతో బుద్ధా వెంకన్న అసహనంగా ఉన్నారని తెలుస్తోంది. గత ఐదేళ్లలో టీడీపీ కోసం ఎన్నో పోరాటాలు చేశానని అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా తనకు న్యాయం మాత్రం జరగడం లేదని బుద్ధా వెంకన్న తాజాగా చెప్పుకొచ్చారు. తాను ఆవేదనతో ఈ మాటలను చెబుతున్నానని బుద్ధా వెంకన్న అన్నారు.
 
కేశినేని చిన్ని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా బుద్ధా వెంకన్న ఈ కామెంట్లు చేయడం జరిగింది. నాకు టికెట్ దక్కకపోయినా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేశానని ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో నాపై ఏకంగా 37 కేసులు నమోదయ్యాయని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. సీఐల బదిలీల విషయంలో ఎమ్మెల్యేల మాటే నెగ్గిందని బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు చేయడం కొసమెరుపు.
 
పదవి లేకపోవడంతో ప్రజలకు, నమ్ముకున్న వాళ్లకు ఏమీ చేయలేకపోతున్నానని ఆయన వెల్లడించారు. తానే ప్రస్తుతం ఇతరులపై ఆధారపడ్డానని చెబుతూ తనను నమ్ముకున్న కార్యకర్తలను బుద్ధా వెంకన్న క్షమాపణలు కోరారు. ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు. బుద్ధా వెంకన్న ఆవేదనలో సైతం న్యాయం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  సుజనా చౌదరి ఈ కామెంట్ల విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. కూటమి నేతల మధ్య విభేదాలు పార్టీ పరువు తీస్తున్నాయని చెప్పవచ్చు.













మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>