PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-kcr-ktr-brs-bandi-sanjay-modi864009c9-17de-4234-92cb-e23207988a45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-kcr-ktr-brs-bandi-sanjay-modi864009c9-17de-4234-92cb-e23207988a45-415x250-IndiaHerald.jpg ఓ ప్రముఖ మీడియా సంస్థ రెండు రోజులుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే బిజెపిలో విలీనం కాబోతుందని ప్రచారం చేస్తున్న కథనాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాకుండా జాతీయ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కెసిఆర్ 2001లో ప్రత్యేక తెలంగాణ సాధన ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక మూడోసారి ఎన్నికలు ఎదుర్కోవటానికి కాస్త ముందుగా బీఆర్ఎస్ పార్టీని ఆయన బిఆర్ఎస్ పార్టీగా ప్రకటించారు. భారతీయ రాష్ట్ర సమితిగా ప్రకటించి మహారాష్ట్ర - ఒడిస్సా - ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీBJP;KCR;KTR;BRS;BANDI SANJAY;MODI{#}Maharashtra;Revanth Reddy;KCR;kavitha;KTR;CM;Bharatiya Janata Party;Rajya Sabha;Elections;media;Telangana;Congress;Assembly;Telangana Chief Minister;MLA;Party2028లో తెలంగాణ బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌.. ఇదేం షాకింగ్ లెక్క‌..?2028లో తెలంగాణ బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌.. ఇదేం షాకింగ్ లెక్క‌..?BJP;KCR;KTR;BRS;BANDI SANJAY;MODI{#}Maharashtra;Revanth Reddy;KCR;kavitha;KTR;CM;Bharatiya Janata Party;Rajya Sabha;Elections;media;Telangana;Congress;Assembly;Telangana Chief Minister;MLA;PartyThu, 08 Aug 2024 09:37:00 GMT
ఓ ప్రముఖ మీడియా సంస్థ రెండు రోజులుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే బిజెపిలో విలీనం కాబోతుందని ప్రచారం చేస్తున్న కథనాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాకుండా జాతీయ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కెసిఆర్ 2001లో ప్రత్యేక తెలంగాణ సాధన ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక మూడోసారి ఎన్నికలు ఎదుర్కోవటానికి కాస్త ముందుగా బీఆర్ఎస్ పార్టీని ఆయన బిఆర్ఎస్ పార్టీగా ప్రకటించారు. భారతీయ రాష్ట్ర సమితిగా ప్రకటించి మహారాష్ట్ర - ఒడిస్సా - ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ కార్యాలయాలు స్థాపించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.


అప్పటినుంచి బిఆర్ఎస్ పార్టీకి వరుసగా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు కేసీఆర్ ముద్దుల బిడ్డ కవిత ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. ఇప్పుడు తనతో పాటు తన కుమార్తెను కాపాడుకోవడం కేసీఆర్‌కు అత్య‌వసరం. రెండు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ - బిజెపిలను తట్టుకుని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవడం కేసీఆర్ ముందు పెద్ద సవాల్ గా మారింది. ఈ క్రమంలోనే బిజెపితో వెళితే కేటీఆర్ కూడా సీఎం కావచ్చు అనే భావనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన దూకుడుతో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే లందరినీ కాంగ్రెస్లో చేర్చుకుని అసలు సభలో బలం లేకుండా చేస్తున్నారు. అందుకే బి.ఆర్ఎస్‌ను బిజెపిలో విలీనం చేసే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారా ? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.


సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు ప్రకారం బీఆర్ఎస్ను బిజెపిలో కలిపి కెసిఆర్ రాజ్యసభకు వెళతారని ... అలాగే నలుగురు రాజ్యసభ ఎంపీ పదవులు కూడా తనకు ఇవ్వాలని కేసీఆర్ అడిగినట్లు సమాచారం. ఇదే సమయంలో కవిత కోవర్టుగా మారి కేజ్రీవాల్‌ని ప్రధాన దోషిగా చేసి తాను అప్రూవల్ గా మారితే బెయిల్ రావడంతో పాటు రాష్ట్రంలో తన తండ్రికి.. సోదరుడికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్న దిశగా బిజెపి వీరిని ఒప్పించబోతుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం బీఆర్ఎస్ అత్యంత గడ్డు పరిస్థితిలో అయితే ఎదుర్కొంటున్న మాట వాస్తవం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>