MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood079ebf65-89e2-46d2-a460-551cfe04390f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood079ebf65-89e2-46d2-a460-551cfe04390f-415x250-IndiaHerald.jpgఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదల అయ్యాయి అంటే చాలు విడుదల అయిన మొదటి రోజు 50 కోట్లు కలెక్ట్ చేసింది ... 100 కోట్లు కలెక్ట్ చేసింది అని వార్తలు వస్తూ ఉండేవి. దానితో తెలుగు ప్రేక్షకులు అంతా కూడా మన సినిమాలకు టోటల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు కూడా అన్ని కలెక్షన్స్ రావు. హిందీ మార్కెట్ చాలా పెద్దది అని భావిస్తూ ఉండేవారు. ఇక ఎప్పుడు అయితే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సినిమా విడుదల అయ్యిందో అప్పటి నుండి తెలుగు సినిమా రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా పాన్ ఇtollywood{#}Bahubali;Rajamouli;Blockbuster hit;Tamil;Prabhas;Kannada;bollywood;Hindi;India;Tollywood;Telugu;Cinema;Newsబాలీవుడ్ కి ప్రమాదంగా మారిన టాలీవుడ్.. రానున్న రోజులు మరి కఠినంగా ఉండనున్నాయా..?బాలీవుడ్ కి ప్రమాదంగా మారిన టాలీవుడ్.. రానున్న రోజులు మరి కఠినంగా ఉండనున్నాయా..?tollywood{#}Bahubali;Rajamouli;Blockbuster hit;Tamil;Prabhas;Kannada;bollywood;Hindi;India;Tollywood;Telugu;Cinema;NewsThu, 08 Aug 2024 09:46:00 GMTఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదల అయ్యాయి అంటే చాలు విడుదల అయిన మొదటి రోజు 50 కోట్లు కలెక్ట్ చేసింది ... 100 కోట్లు కలెక్ట్ చేసింది అని వార్తలు వస్తూ ఉండేవి. దానితో తెలుగు ప్రేక్షకులు అంతా కూడా మన సినిమాలకు టోటల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు కూడా అన్ని కలెక్షన్స్ రావు. హిందీ మార్కెట్ చాలా పెద్దది అని భావిస్తూ ఉండేవారు. ఇక ఎప్పుడు అయితే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సినిమా విడుదల అయ్యిందో అప్పటి నుండి తెలుగు సినిమా రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మూవీ తో తెలుగు సినిమా సత్తా ఏమిటి అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. ఇక అప్పటి నుండి తెలుగు ఫిలిం మేకర్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలను నిర్మించడంలో బిజీ అయిపోయారు. మన స్టార్ హీరోలలో ఇప్పుడు చాలా మంది పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. ఇకపోతే వీరు నటించిన సినిమాలకు మొదటి రోజే వందల కోట్ల కలెక్షన్లు వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ కి మించిన కలెక్షన్లు ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు వస్తున్నాయి. ఇక ఇప్పటికే బాలీవుడ్ సినిమాను మించిపోయే స్థాయి సినిమాలు తెలుగులో వచ్చాయి.

ఇకపోతే ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలు అంతా కూడా దాదాపుగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. ఆ మూవీలపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు అనుకున్న స్థాయి విజయాలను అందుకున్నట్లు అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి మరింత పైకి వెళ్లే అవకాశం చాలా వరకు ఉంది. అదే కానీ జరిగితే బాలీవుడ్ ఇండస్ట్రీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద ప్రమాదంగా మారే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇక రాబోయే కాలంలో మన తెలుగు సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకొని అత్యున్నత స్థాయికి ఎదగాలి అని తెలుగు ప్రజలంతా కోరుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>