PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/botsa-sathyanarayana-vijayanagaram-johnsy-madhavi-kala-venkat-raodd283ba6-1ebb-47b7-8d8b-4b29ee96a88c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/botsa-sathyanarayana-vijayanagaram-johnsy-madhavi-kala-venkat-raodd283ba6-1ebb-47b7-8d8b-4b29ee96a88c-415x250-IndiaHerald.jpgవిజయనగరం జిల్లా రాజకీయాల పేరు చెప్పగానే చాలామందికి బొత్స కుటుంబీకులే గుర్తుకొస్తారు. బొత్స సత్యనారాయణ అయితే గత 20 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో తన మార్కు చూపిస్తున్నారు. అలాంటి బొత్స సత్యనారాయణతో పాటు తన ఫ్యామిలీని కూడా ఈసారి మడిచి అవతల పడేసారు. అలాంటి విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీ సైలెంట్ అయిపోయి దారుణంగా ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణకు సపోర్ట్ చేసే స్థితిలో కూడా కనిపించడం లేదు. మరి బొత్స పరిస్థితి ఏంటి వారంతా ఎక్కడికి వెళ్లారు అనే వివరాలు చbotsa sathyanarayana; vijayanagaram; johnsy; madhavi; kala venkat rao{#}madhavi;BOTCHA SATYANARAYANA;Kala Venkata Rao;Venkata Rao;District;Vishakapatnam;Vijayanagaram;Vizianagaram;Janasena;Congress;TDP;local language;Minister;Wife;YCP;Electionవైసీపీ ఖాళీ ఖాళీ:బొత్స ఫ్యామిలీ ఆలౌట్.!వైసీపీ ఖాళీ ఖాళీ:బొత్స ఫ్యామిలీ ఆలౌట్.!botsa sathyanarayana; vijayanagaram; johnsy; madhavi; kala venkat rao{#}madhavi;BOTCHA SATYANARAYANA;Kala Venkata Rao;Venkata Rao;District;Vishakapatnam;Vijayanagaram;Vizianagaram;Janasena;Congress;TDP;local language;Minister;Wife;YCP;ElectionThu, 08 Aug 2024 09:42:00 GMT- వైసీపీ ప్రభుత్వంలో పెద్దపీట.
- 2024 ఎలక్షన్స్ లో పాతాళానికి.
- దిక్కుతోచని స్థితిలో బొత్స ఫ్యామిలీ.!


విజయనగరం జిల్లా రాజకీయాల పేరు చెప్పగానే చాలామందికి బొత్స కుటుంబీకులే గుర్తుకొస్తారు. బొత్స సత్యనారాయణ అయితే గత 20 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో తన మార్కు చూపిస్తున్నారు. అలాంటి బొత్స సత్యనారాయణతో పాటు తన ఫ్యామిలీని కూడా ఈసారి మడిచి అవతల పడేసారు. అలాంటి విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీ సైలెంట్ అయిపోయి దారుణంగా ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బొత్స సత్యనారాయణకు సపోర్ట్ చేసే స్థితిలో కూడా కనిపించడం లేదు. మరి బొత్స పరిస్థితి ఏంటి వారంతా ఎక్కడికి వెళ్లారు అనే వివరాలు చూద్దాం.

 సత్యనారాయణకు షాక్:
 కాంగ్రెస్ మరియు వైసీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన బొత్స సత్యనారాయణ, పొలిటికల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్  మరియు వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2 నేతగా ఉన్న  ఈయన ఈ ఎన్నికల్లో దారుణంగా చతికిలపడ్డారు. బొత్స తో పాటు భార్య, సోదరుడు, మేనల్లుడు అందరూ ఓడిపోయారు.  టిడిపి నుంచి మాజీ మంత్రి కళా వెంకట్రావు చేతిలో బొత్స సత్యనారాయణ 11,900 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2004 నుంచి 2009 చీపురుపల్లిలో గెలిచిన బొత్సకు ఈసారి మాత్రం పరాభవం తప్పలేదు. ఈయనకే కాకుండా తన తన సోదరుడు అయినా అప్పల నరసయ్య గజపతినగరం నుంచి పోటీ చేశారు.  ఈయన కూడా చాలా దారుణ ఓటమి పాలయ్యారు. ఇక విశాఖ ఇంటికి పోటీ చేసిన ఆయన భార్య బొత్స ఝాన్సీ కూడా దాదాపు 5 లక్షల తేడాతో ఓడిపోయారు.

ఝాన్సీ 2001 నుంచి 2006 వరకు విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా చేసింది. రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఝాన్సీ ఈసారి ఓడిపోయింది. ఇక నెల్లిమర్ల నుంచి పోటీ చేసిన  బొత్స మేనల్లుడు అప్పలనాయుడు కూడా  దారుణంగా ఓడిపోయారు. ఈయనపై పోటీ చేసిన జనసేన అభ్యర్థి  లోకం మాధవి గెలుపొందింది. ఈ విధంగా విజయనగరం జిల్లాలో వైసీపీ మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా చేశారు. ఇన్ని స్థానాల్లో ఓడిపోయినటువంటి బొత్స ఫ్యామిలీ ప్రస్తుతం ఏ ప్రోగ్రామ్స్ లో కూడా కనిపించడం. కానీ ఇదే తరుణంలో బొత్సకు  ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేసే అవకాశం వచ్చింది.  ఎలాగైనా విజయం సాధించాలని భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసిపి ఓటర్లు మాత్రం ఆయనకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరని చెప్పవచ్చు. అంతేకాదు టిడిపి కూటమి నుంచి బలమైన అభ్యర్థిని దించి బొత్సను మళ్ళీ ఎదగకుండా చేయాలనే ప్లాన్ చేస్తోంది. ఓడిపోయినటువంటి తన కుటుంబ సభ్యులు కూడా బొత్సకు ఏ విధంగా సపోర్ట్ చేసినట్టు మాత్రం కనిపించడం లేదు. ఈ విధంగా టిడిపి కూటమి అధికారంలోకి రాగానే  బొత్స ఫ్యామిలీ మొత్తం సైలెంట్ అయిపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>