MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chinnac5837e78-e175-4b6a-a603-d582d5afee3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chinnac5837e78-e175-4b6a-a603-d582d5afee3f-415x250-IndiaHerald.jpgమహేష్ గొప్ప మనసు గురించి ఇప్పటికే ఎంతో మంది నటులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి చిన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా మహేష్ గొప్పతనం గురించి తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చిన్నా మాట్లాడుతూ ... మురారి సినిమాకు సంబంధించిన 50 రోజుల షూటింగ్ అవుట్ డోర్ రామచంద్రాపురం లో జరిగింది. ఈ షూటింగ్ లో అందరికీ ప్రొడక్షన్ ఫుడ్ ఉండేది. అయితే నాకు మాత్రం ప్రొడక్షన్ ఫుడ్ అస్సలు పడేది కాదు. షూటింగ్ లో ఉన్నప్పుడు ఇంటి నుండే chinna{#}chinna;krishna;Ramachandrapuram;Murari;mahesh babu;Interview;House;Cinemaమహేష్ ఎంతో గొప్పవాడు.. నా సమస్యను తీర్చడానికి అంత పెద్ద త్యాగం చేశాడు... చిన్నా..!మహేష్ ఎంతో గొప్పవాడు.. నా సమస్యను తీర్చడానికి అంత పెద్ద త్యాగం చేశాడు... చిన్నా..!chinna{#}chinna;krishna;Ramachandrapuram;Murari;mahesh babu;Interview;House;CinemaThu, 08 Aug 2024 10:15:00 GMTమహేష్ గొప్ప మనసు గురించి ఇప్పటికే ఎంతో మంది నటులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి చిన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా మహేష్ గొప్పతనం గురించి తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చిన్నా మాట్లాడుతూ ... మురారి సినిమాకు సంబంధించిన 50 రోజుల షూటింగ్ అవుట్ డోర్ రామచంద్రాపురం లో జరిగింది. ఈ షూటింగ్ లో అందరికీ ప్రొడక్షన్ ఫుడ్ ఉండేది.

అయితే నాకు మాత్రం ప్రొడక్షన్ ఫుడ్ అస్సలు పడేది కాదు. షూటింగ్ లో ఉన్నప్పుడు ఇంటి నుండే ఫుడ్ వచ్చేది. అదే నేను తినేవాడ్ని. అవుట్ డోర్ లో అలా ఉండదు కదా. ఇక ఆ అవుట్ డోర్ షూటింగ్ లో ఒకటి , రెండు రోజులు అడ్జస్ట్ అయ్యాను. కానీ ఆ తర్వాత నా వల్ల కాలేదు. ఇక అప్పటికే కృష్ణ గారి కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉండేది. మురారి సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు గారి చెల్లెలి వాళ్ళ ఇల్లు అక్కడే రామచంద్రపురం లో ఉండడంతో ఆయనకు వారి చెల్లి ఇంటి నుండి ఫుడ్ వచ్చేది. దాంతో ఒక రోజు నేను మహేష్ గారి దగ్గరకు వెళ్లాను.

వెళ్లి నాకు బయట ఫుడ్ పడదు సార్. మీకు మీ చెల్లెలు ఇంటి దగ్గర నుండి ఇంటి ఫుడ్ వస్తుంది. మీరు ఏమి అనుకోకపోతే నాకు ఆ ఫుడ్ పెడతారా అని అడిగాను. దానితో అందులో ఏముంది సార్ ... వచ్చి రోజు నాతో పాటు తినండి అని చెప్పారు. ఇక ఆ తర్వాత నుండి ఆ సినిమా షూటింగ్ ఔట్ డోర్ లో జరిగిన అన్ని రోజులు మధ్యాహ్నం లంచ్ టైమ్ లో నేను మహేష్ దగ్గరికి వెళ్లి తినేవాడిని అని , ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని తాజాగా సీనియర్ నటుడు చిన్నా తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా ఈయన మహేష్ బాబు గురించి చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>