PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-3a89064c-0b96-47d8-9813-9242ca4d1aee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-3a89064c-0b96-47d8-9813-9242ca4d1aee-415x250-IndiaHerald.jpgఅదేదో సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి' అంటూ ఒక డైలాగ్ చెప్తారు. నిజంగానే ఈ విషయం తెలిసి ఉంటే జీవితంలో సక్సెస్ సాధించగలం. సినిమాలో ఈ డైలాగ్ చెప్పడమే కాదు దాన్ని రియల్ లైఫ్ లో పాటిస్తుంటారు పవన్ కళ్యాణ్. అలా పాటించడం వల్లే ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. వివిధ శాఖల మంత్రిగా కూడా అయ్యారు. ఆ పదవిలో ఉన్నా కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ అధికారం కోసం పాకులాడకుండా ఇచ్చిన పదవినే అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాలని ప్రయత్నిస్తున్నారు. Pawan Kalyan {#}CBN;annapurna;Pawan Kalyan;Andhra Pradesh;Deputy Chief Minister;School;Success;kalyan;Janasena;Government;TDPఆ విషయంలో వెనక్కి తగ్గిన పవన్.. ప్రశంసలు కురిపిస్తున్న జనసైనికులు..??ఆ విషయంలో వెనక్కి తగ్గిన పవన్.. ప్రశంసలు కురిపిస్తున్న జనసైనికులు..??Pawan Kalyan {#}CBN;annapurna;Pawan Kalyan;Andhra Pradesh;Deputy Chief Minister;School;Success;kalyan;Janasena;Government;TDPThu, 08 Aug 2024 12:41:00 GMT

 అదేదో సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి' అంటూ ఒక డైలాగ్ చెప్తారు. నిజంగానే ఈ విషయం తెలిసి ఉంటే జీవితంలో సక్సెస్ సాధించగలం. సినిమాలో ఈ డైలాగ్ చెప్పడమే కాదు దాన్ని రియల్ లైఫ్ లో పాటిస్తుంటారు పవన్ కళ్యాణ్. అలా పాటించడం వల్లే ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. వివిధ శాఖల మంత్రిగా కూడా అయ్యారు. ఆ పదవిలో ఉన్నా కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ అధికారం కోసం పాకులాడకుండా ఇచ్చిన పదవినే అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాలని ప్రయత్నిస్తున్నారు.

అంతే కాదు తన మాటే నెగ్గాలని టిడిపి వాళ్ళతో గొడవలు కూడా పెట్టుకోవడం లేదు. ఆయనే వెనక్కి  తగ్గుతూ మంచి నేతగా ఒక మెట్టు పైకి ఎదుగుతున్నారు. తాజాగా పవన్ మరో విషయంలో వెనక్కి తగ్గి అందరి చేత పొగిడించుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ మద్దతుదారులు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే  తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని తాను కోరిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

టీడీపీ కూటమి ఆగస్టు 15న నుంచి ఏపీ అంతటా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పవన్ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని పవన్ కోరగా చంద్రబాబు సరిగా స్పందించలేదు. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి చేయకపోవడంతో పవని ముందుగా అది సాధ్యం కాదేమో అని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలా వెనక్కి తగ్గి అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మిడ్ డే మీల్స్ స్కీమ్‌కు డొక్కా సీతమ్మ పేరు పెట్టి పవన్ కళ్యాణ్ కోరికను సగం నెరవేర్చారు. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరును పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి పెట్టారు కాబట్టి క్యాంటీన్ల విషయంలో తన నిర్ణయం మార్చుకున్నట్లు పవన్ వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల డొక్కా సీతమ్మ గురించి ఇప్పుడు ప్రతి స్టూడెంట్‌కు తెలుస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పాఠశాల స్థాయిలోనే గొప్ప వ్యక్తులు, దాతృత్వం కలిగినవారి పేర్ల మీద పథకాలు తీసుకురావడం వల్ల చాలామంది ఇన్‌స్పైర్‌ అవుతారని పేర్కొన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>