DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/cbn2f5ba0d1-c7a8-4794-a988-367994aaad4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/cbn2f5ba0d1-c7a8-4794-a988-367994aaad4b-415x250-IndiaHerald.jpgఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు దాటింది. ప్రభుత్వ పనితీరును ఇప్పుడే బేరీజే వేయకపోయినా.. ప్రజా వ్యతిరేక ఉద్యమాలు మాత్రం మొదలు అయ్యాయి. రషీద్ హత్య అనంతరం వైఎస్ జగన్ దిల్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నిరసన వ్యక్తం చేసినా.. అది రాజకీయ పార్టీల మధ్య వైరంగా చూస్తారు. కానీ ప్రజా ఉద్యమంలో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన చేపడతారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండో నెలలోనే తొలి ఉద్యమం జరిగింది. అక్రమ తొలిగింపులు-రాజకీయ వేధcbn{#}Nara Lokesh;Murder.;CM;Deputy Chief Minister;Jagan;Minister;Party;TDP;CBN;Governmentచంద్రబాబు పాలన.. అప్పుడే జనం రోడ్లపైకి వస్తున్నారా?చంద్రబాబు పాలన.. అప్పుడే జనం రోడ్లపైకి వస్తున్నారా?cbn{#}Nara Lokesh;Murder.;CM;Deputy Chief Minister;Jagan;Minister;Party;TDP;CBN;GovernmentThu, 08 Aug 2024 11:00:00 GMTఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు దాటింది.  ప్రభుత్వ పనితీరును ఇప్పుడే బేరీజే వేయకపోయినా.. ప్రజా వ్యతిరేక ఉద్యమాలు మాత్రం మొదలు అయ్యాయి. రషీద్ హత్య అనంతరం వైఎస్ జగన్ దిల్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నిరసన వ్యక్తం చేసినా.. అది రాజకీయ పార్టీల మధ్య వైరంగా చూస్తారు.
 

కానీ ప్రజా ఉద్యమంలో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన చేపడతారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండో నెలలోనే తొలి ఉద్యమం జరిగింది. అక్రమ తొలిగింపులు-రాజకీయ వేధింపులను ఆపాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా  సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీలు, కలక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఆశాలు, అంగన్ వాడీలు, వీవోఏలు, యూనిమేటర్లు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, గ్రీన్ అంబాసీడర్లు, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.


కక్ష సాధింపు చర్యలు, తొలగింపులు, బెదిరింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ మేరకు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. రాజకీయ వేధింపులకు తాము వ్యతిరేకం అని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లు పైకి చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం దాడులు ఆగడం లేదని విమర్శించారు.


ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ  వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు వీవోఏలు, యానిమేటర్లు పెద్ద సంఖ్యలో తొలగింపునకు గురి అయ్యారని ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలో ఇచ్చిన మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.  సీఐటీయూ క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తుంటే.. దీనికి అనుబంధ రాజకీయ పార్టీ అయిన సీపీఎం వీరి పోరాటాలకు మద్దతు ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>