Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood803f3ecd-134b-4301-a0ca-d1cff770552f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood803f3ecd-134b-4301-a0ca-d1cff770552f-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాలో ఎన్నో రకాల పాత్రలు ఉంటాయి. కానీ ఇక సినిమాల్లో అతి కష్టమైన పాత్ర ఏదైనా ఉంటుంది అంటే అది కమెడియన్ పాత్ర. ఎందుకంటే కమెడియన్ కేవలం అందరిలా డైలాగులు చెప్పడం కాదు. తన హావా భావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాలి. అలా నవ్వించినప్పుడే ఆ పాత్రకు న్యాయం చేసినట్లు అవుతుంది. అందుకే ఎంతోమంది కమెడియన్లు తమదైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ.. ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇలా నేటితరంలో కమెడియన్స్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మెట్ట రాజేKollywood{#}rajendran;surya sivakumar;Comedian;Traffic police;Dalapathi;Kollywood;Joseph Vijay;Telugu;Cinemaఈ కమెడియన్ గుర్తున్నాడా.. ప్రతి సినిమాలో ఎందుకు గుండుతోనే ఉంటాడో తెలుసా?ఈ కమెడియన్ గుర్తున్నాడా.. ప్రతి సినిమాలో ఎందుకు గుండుతోనే ఉంటాడో తెలుసా?Kollywood{#}rajendran;surya sivakumar;Comedian;Traffic police;Dalapathi;Kollywood;Joseph Vijay;Telugu;CinemaThu, 08 Aug 2024 11:45:00 GMTసాధారణంగా సినిమాలో ఎన్నో రకాల పాత్రలు ఉంటాయి. కానీ ఇక సినిమాల్లో అతి కష్టమైన పాత్ర ఏదైనా ఉంటుంది అంటే అది కమెడియన్ పాత్ర. ఎందుకంటే కమెడియన్ కేవలం అందరిలా డైలాగులు చెప్పడం కాదు.  తన హావా భావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాలి. అలా నవ్వించినప్పుడే ఆ పాత్రకు న్యాయం చేసినట్లు అవుతుంది. అందుకే ఎంతోమంది కమెడియన్లు తమదైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ.. ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇలా నేటితరంలో కమెడియన్స్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మెట్ట రాజేంద్రన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.



 ఈయనని నాన్ కడవవ్ రాజేంద్రన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎంతోమంది అభిమానులు. ఇక తెలుగు ప్రేక్షకులు సూర్య హీరోగా నటించిన సింగం 2 మూవీలో విలన్ క్యారెక్టర్ సహాయం పాత్రలో చేసిన నటుడు అంటే చాలు టక్కున గుర్తుపట్టిస్తూ ఉంటారు. ఇక మరింత ఈజీగా గుర్తుపట్టాలంటే దళపతి విజయ్ హీరోగా నటించిన పోలీసోడు మూవీలో విజయ్ పక్కనే పోలీస్ ఆఫీసర్ గా ఉండే రాజేంద్రన్ అన్న కూడా ఇంకా త్వరగానే గుర్తుపట్టిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే తనదైన హావ భావాలతో డైలాగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని.. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు ఈయన.


 కోలీవుడ్ నటుడు అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ కూడా ఈయన కామెడీని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఎప్పుడూ ప్రతి సినిమాలో కూడా గుండుతోనే కనిపిస్తూ ఉంటాడు. అయితే ఇలా గుండుతో కనిపించడం వెనక.. పెద్ద స్టోరీ నే ఉందట. ఓ సినిమా షూటింగ్స్ సందర్భంగా విజయ్ రాఘవేంద్ర అనే నటుడిని కొట్టి పక్కనే ఉన్న చెరువులో రాజేంద్రన్ దూకేయాలి. కానీ చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వల్ల ఆ చెరువులో పక్కనే ఉన్న ఫ్యాక్టరీ నుంచి రసాయనాలు వచ్చి కలుస్తున్నాయి అన్న విషయాన్ని గమనించలేదు. దీంతో రాజేంద్రన్ చెరువులో దూకేసాడు. దీంతో అతని జుట్టు మొత్తం ఊడిపోయింది. డాక్టర్స్ భవిష్యత్తులో జుట్టు పెరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇక కొన్నాళ్ళకి కనుబొమ్మల జుట్టు కూడా ఊడిపోయింది. అలాగే మొహం మొత్తం రఫ్ గా మారిపోయింది. ఇక తర్వాత అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయట. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని ఆయన మళ్ళి సినిమాల్లో ప్రేక్షకులను అలవిస్తున్నారు. అయితే ఇలా జుట్టు పెరగకపోవడం కారణంగానే ఆయన ప్రతి సినిమాలో కూడా గుండుతోనే కనిపిస్తూ ఉంటారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>