Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-sanonda62e821-d84c-42f3-8219-7818c6dce40e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-sanonda62e821-d84c-42f3-8219-7818c6dce40e-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో వరుస సినిమాలతో మొన్నటిదాకా తన ఫాం కొనసాగించిన కృతి సనన్ ఆదిపురుష్ ఫ్లాప్ తర్వాత కాస్త తన జోరు తగ్గించిందని చెప్పొచ్చు. ఈమధ్యనే క్రూ తో సూపర్ హిట్ అందుకున్న కృతి సనన్ ఓ పక్క బాలీవుడ్ లో తన దూసుకెళ్తూనే సౌత్ లో కూడా రాణించాలని చూస్తుంది. మోడల్ గా ఉన్న అమ్మడు మొదటి సినిమా చేసింది మహేష్ తోనే. సుకుమార్ డైరెక్షన్ లోKrithi Sanon{#}Anand L Rai;kriti sanon;seetha;Prabhas;Kollywood;dhanush;Heroine;bollywood;sukumar;Telugu;Cinemaప్రభాస్ తర్వాత ఆ సౌత్ స్టార్ తో బాలీవుడ్ భామ..!ప్రభాస్ తర్వాత ఆ సౌత్ స్టార్ తో బాలీవుడ్ భామ..!Krithi Sanon{#}Anand L Rai;kriti sanon;seetha;Prabhas;Kollywood;dhanush;Heroine;bollywood;sukumar;Telugu;CinemaThu, 08 Aug 2024 22:40:00 GMTబాలీవుడ్ లో వరుస సినిమాలతో మొన్నటిదాకా తన ఫాం కొనసాగించిన కృతి సనన్ ఆదిపురుష్ ఫ్లాప్ తర్వాత కాస్త తన జోరు తగ్గించిందని చెప్పొచ్చు. ఈమధ్యనే క్రూ తో సూపర్ హిట్ అందుకున్న కృతి సనన్ ఓ పక్క బాలీవుడ్ లో తన దూసుకెళ్తూనే సౌత్ లో కూడా రాణించాలని చూస్తుంది. మోడల్ గా ఉన్న అమ్మడు మొదటి సినిమా చేసింది మహేష్ తోనే. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ ఆ తర్వాత తెలుగు లో చైతన్యతో దోచెయ్ సినిమా చేసింది.

ఐతే తెలుగులో పెద్దగా లక్ కలిసి రాకపోవడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ మాత్రం అమ్మడికి ముందు మంచి ఆఫర్లు రాకపోయినా తర్వాత కష్టానికి తగిన ఆఫర్లు వచ్చాయి. లాస్ట్ ఇయర్ ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించిన కృతి సనన్ ఇప్పుడు మరో సౌత్ స్టార్ తో జత కట్టబోతుందని తెలుస్తుంది. ఐతే అది కూడా బాలీవుడ్ సినిమానే అవ్వడం విశేషం.

బాలీవుడ్ లో ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమా ఎప్పుడో ప్రకటించారు కానీ సెట్స్ మీదకు వెళ్లలేదు. ఫైనల్ గా ఈ సినిమా లో హీరోయిన్ గా కృతిని సెలెక్ట్ చేసి త్వరలోనే సినిమా రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతున్నారని తెలుస్తుంది. ఐతే కృతి సనన్ కి ముందు కీరా, త్రిప్తిలను ఈ సినిమాలో తీసుకోవాలని అనుకున్నారట. కానీ తిరిగి తిరిగి ఆఫర్ మళ్లీ అమ్మడి దగ్గరకు వచ్చింది. కృతి చేతిలో ఉన్న మోస్ట్ క్రేజియెస్ట్ ఆఫర్ ఇదే అని చెప్పొచ్చు. ఆనంద్ ఎల్ రాయ్ తో ధనుష్ ఇదివరకు రాంజానా సినిమా చేశాడు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>