Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli3a9b8b68-d4fd-4155-8ca5-a92dde31a189-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli3a9b8b68-d4fd-4155-8ca5-a92dde31a189-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం వరుసగా సిరీస్ లు ఆడుతూ అదరగొడుతుంది. అయితే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా టి20 సిరీస్ ను గెలుచుకుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ లో వన్డే ఫార్మాట్లో బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే గత కొన్ని దశాబ్దాల నుంచి శ్రీలంకపై ఇండియా వన్డే ఫార్మాట్లో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తూ ఉండగా.. ఇక ఈసారి కూడా భారత జట్టుదే పైచేయి అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో గెలవాల్సిKohli{#}surya sivakumar;VIRAT KOHLI;Ashish Vidyarthi;Parugu;Gautam Gambhir;Yuva;Rohit Sharma;India;Sri Lankaశ్రీలంకతో సిరిస్.. కోహ్లీ, రోహిత్ అవసరమా.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్?శ్రీలంకతో సిరిస్.. కోహ్లీ, రోహిత్ అవసరమా.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్?Kohli{#}surya sivakumar;VIRAT KOHLI;Ashish Vidyarthi;Parugu;Gautam Gambhir;Yuva;Rohit Sharma;India;Sri LankaWed, 07 Aug 2024 13:45:00 GMTప్రస్తుతం భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం వరుసగా సిరీస్ లు ఆడుతూ అదరగొడుతుంది. అయితే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా టి20 సిరీస్ ను గెలుచుకుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ లో వన్డే ఫార్మాట్లో బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే గత కొన్ని దశాబ్దాల నుంచి శ్రీలంకపై ఇండియా వన్డే ఫార్మాట్లో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తూ ఉండగా.. ఇక ఈసారి కూడా భారత జట్టుదే పైచేయి అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో గెలవాల్సిన రెండు మ్యాచుల్లోనూ అటు టీమ్ ఇండియాకు చేదు అనుభవం ఎదురయింది అని చెప్పాలి.


 ఎందుకంటే అటు మొదటి myachలో ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో గెలవాల్సిన మ్యాచ్ ని గెలవలేకపోయింది. ఇక ఆ తర్వాత రెండు వన్డే మ్యాచ్లలో చెత్త ప్రదర్శన కారణంగా ఓటమిపాలు అయింది అని చెప్పాలి. దీంతో శ్రీలంకతో పోల్చి చూస్తే వెనకబడిపోయింది టీమిండియా. కాగా నేడు మూడో వన్డే మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలుస్తుందా లేదా అనే విషయంపై అందరిలో ఉత్కంఠ ఉంది అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల మధ్య టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్ర భారత జట్టులో సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్న రోహిత్ కోహ్లీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఆడాల్సిన అవసరం లేదు అంటూ మాజీ బౌలర్ ఆశిష్ నెహ్ర అభిప్రాయం వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల గురించి అటు కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కు తెలియనిది ఏముంది. అతను ఏమీ విదేశీ కోచ్ కాదు కదా. అందుకే ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లని విదేశాల్లో జరిగే సిరీస్ లలో ఆడించవచ్చు. అయితే గంభీర్ వ్యూహం తప్పు అని నేను అనడం లేదు. కానీ ఈ సిరీస్ లో ఈ వ్యూహాన్ని అమలు చేస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆశిష్ నెహ్ర.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>