Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababudcee341a-7451-4716-859d-cb49208cf2b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababudcee341a-7451-4716-859d-cb49208cf2b9-415x250-IndiaHerald.jpgఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే పాలనలో చంద్రబాబు ప్రభుత్వం కుదురుకుంటుంది. ఇలాంటి సమయంలో ఇక నామినేటెడ్ పదవుల విషయంపై ప్రస్తుతం సీఎం చంద్రబాబు దృష్టి పెడుతున్నారు అన్నది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కూటమిలో టిడిపి జనసేన బిజెపి పార్టీలు ఉండడంతో ఈ మూడు పార్టీలకు నామినేటెడ్ పదవుల్లో ఎంత మొత్తంలో కేటాయింపులు జరుగుతాయి అనే విషయంపై ఆసక్తి నెలకొంది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం నామినేటెడ్ పదవుల్లో 18 లేదా 20% మాత్రమే జనసేన బిజెపి పార్టీలకు ఇవ్వాలChandrababu{#}Janasena;Assembly;Bharatiya Janata Party;kalyan;TDP;CM;Party;CBN;Governmentనామినేటెడ్ పదవులు.. చంద్రబాబు తీరుపై జనసేన అసంతృప్తి?నామినేటెడ్ పదవులు.. చంద్రబాబు తీరుపై జనసేన అసంతృప్తి?Chandrababu{#}Janasena;Assembly;Bharatiya Janata Party;kalyan;TDP;CM;Party;CBN;GovernmentWed, 07 Aug 2024 14:30:00 GMTఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే పాలనలో చంద్రబాబు ప్రభుత్వం కుదురుకుంటుంది. ఇలాంటి సమయంలో ఇక నామినేటెడ్ పదవుల విషయంపై ప్రస్తుతం సీఎం చంద్రబాబు దృష్టి పెడుతున్నారు అన్నది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కూటమిలో టిడిపి జనసేన బిజెపి పార్టీలు ఉండడంతో ఈ మూడు పార్టీలకు నామినేటెడ్ పదవుల్లో ఎంత మొత్తంలో కేటాయింపులు జరుగుతాయి అనే విషయంపై ఆసక్తి నెలకొంది  ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం నామినేటెడ్ పదవుల్లో 18 లేదా 20% మాత్రమే జనసేన బిజెపి పార్టీలకు ఇవ్వాలని.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారట.


 ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 బిజెపి పది స్థానాల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మొత్తంలో అయితే సీట్లు కేటాయించారో.. ఆ ప్రాతిపదికనే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా వాటా ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై అటు జనసేన బిజెపి పార్టీల నేతలు మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు సమయంలో తాము 31 స్థానాలలో మాత్రమే పోటీ చేశాము అంటే 144 సీట్లలో పోటీ చేయలేదని కాదు అని.. వాటిని త్యాగం చేశాము అని అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారట.



 ఆ లెక్కన చూస్తే తమకు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మొత్తంలో సీట్లు కేటాయించారు. కాబట్టి ఇక ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో 80% పోస్టులు ఇవ్వాలని.. కానీ అంత మొత్తంలో ఇవ్వకపోయినా లెక్కలతో నిమిత్తం లేకుండా కీలక త్యాగాలు చేస్తున్న బలమైన నాయకులు అందరికీ కూడా నామినేటెడ్ పదవులు దక్కేలా చూడాలని కోరుతున్నారట జనసేన బిజెపి పార్టీల నేతలు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేసేందుకు ఇక పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి పార్టీ నేతలు డిమాండ్లను పవన్ చంద్రబాబు ముందు వినిపిస్తారో లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఎన్ని ఇస్తే అన్ని చాలు అన్నట్లుగా ఊరుకుంటారో అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>