MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suma-caught-in-the-rocky-avenues-controversy-clarity-at-last56af2930-83bc-4b90-b6e7-a113d145aab8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suma-caught-in-the-rocky-avenues-controversy-clarity-at-last56af2930-83bc-4b90-b6e7-a113d145aab8-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై టాప్ యాంకర్‌గా ఉన్న సుమ, తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. గతంలో సుమ చేసిన ఓ యాడ్ కారణంగా పలువురు సామాన్యులు ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామంటూ వాపోతున్నారు. రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెంచర్‌కి సంబంధించిన యాడ్‌లో సుమ చెప్పినందుకే తాము ఫ్లాట్స్ కొన్నామని.. ఇప్పుడు పూర్తిగా మోసపోయామంటూ బాధితులు చెబుతున్నారు.తాజాగా యాంకర్‌ సుమ సోషల్‌మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.'రాకీ అవెన్యూస్‌కు సంబంధించిన ఒక యాడ్‌లో నేను గతంలో నటించాను. నా వృత్తిలో భాగంగా 2016-2018 వరకు మాత్రమే వారితో ఒప్పందం ఉంది. tollywood{#}Avantikka;Rocky;avanthika;suma;suma kanakala;advertisement;contract;Andhra Pradeshరాకీ అవెన్యూస్ వివాదంలో చిక్కుకున్న సుమ.. ఎట్టకేలకు క్లారిటీ..!?రాకీ అవెన్యూస్ వివాదంలో చిక్కుకున్న సుమ.. ఎట్టకేలకు క్లారిటీ..!?tollywood{#}Avantikka;Rocky;avanthika;suma;suma kanakala;advertisement;contract;Andhra PradeshWed, 07 Aug 2024 18:00:47 GMTబుల్లితెరపై టాప్ యాంకర్‌గా ఉన్న సుమ, తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. గతంలో సుమ చేసిన ఓ యాడ్ కారణంగా పలువురు సామాన్యులు ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామంటూ వాపోతున్నారు. రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెంచర్‌కి సంబంధించిన యాడ్‌లో సుమ చెప్పినందుకే తాము ఫ్లాట్స్ కొన్నామని.. ఇప్పుడు పూర్తిగా మోసపోయామంటూ బాధితులు చెబుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ కన్ స్ట్రక్షన్ కంపెనీ రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో చంద్రిక అవంతిక ఫేస్ 2 అనే వెంచర్ వేసింది. ఈ సంద‌ర్భంగా డబుల్ బెడ్ రూమ్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లను కట్టి తక్కువ రేట్‌కే ఇస్తామని ప్రచారం చేసింది.  తాజాగా యాంకర్‌ సుమ సోషల్‌మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.'రాకీ అవెన్యూస్‌కు సంబంధించిన ఒక యాడ్‌లో నేను గతంలో నటించాను. నా వృత్తిలో

 భాగంగా 2016-2018 వరకు మాత్రమే వారితో ఒప్పందం ఉంది. ఆపై ఆ ప్రకటనలు రద్దు చేయబడ్డాయి. ఈ ప్రకటనలు ఇప్పుడు అనధికారమైనవి అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. పైన పేర్కొన్న వ్యవధి తర్వాత నేను ఏ సందర్భంలోనూ రాకీ అవెన్యూస్‌కు సంబంధించిన యాడ్‌లో కనిపించలేదు. అయితే, కొంత కాలం తర్వాత పాత ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని నా దృష్టికి వచ్చింది. ఇటీవలి కాలంలో నేను రాకీ అవెన్యూల ఆస్తుల కొనుగోలుదారుల నుంచి కొన్ని లీగల్ నోటీసులను అందుకున్నాను. ఆపై

 వారి నోటీసులకు నేను సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో రాకీ అవెన్యూలకు పంపిన లీగల్ నోటీసులో కొనుగోలుదారుల జాబితాను కూడా పరిశీలించమని వారిని కోరాను. నేను కూడా ఈ సమస్యను పరిష్కరించేందకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. తప్పుడు సమాచారాన్ని అరికట్టండి. అధికారిక ఛానెల్‌ల నుంచి వచ్చే ఏదైనా ప్రకటనలు, ప్రమోషన్‌లు, వీడియోలను ధృవీకరించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ధృవీకరించబడిన సమాచారాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవాలని నేను ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.' అంటూ పేర్కొంది సుమ. మరి ఈ చర్చ ఎంతటికి దారితీస్తుందో చూడాల్సిందే..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>