MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-859af29c-5ab0-4d99-bf98-fef7b1111546-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-859af29c-5ab0-4d99-bf98-fef7b1111546-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో హీరోయిన్లు రెమ్యునరేషన్ విషయంలో హీరోలతో పోటీ పడుతున్నారనే మాట వాస్తవం. ఒక్క పెద్ద హిట్ వస్తే చాలు కొత్త హీరోయిన్లు కూడా కోటి రూపాయల కంటే ఎక్కువ పారితోషికం అడుగుతున్నారు. రెండో హిట్ వస్తే చాలు రూ.3-రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు ఈరోజుల్లో ఎవరు ఎంత కాలం ఉంటారో చెప్పలేని పరిస్థితి అందుకే దీపం వెలిగినప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఒక ఆలోచనతో వీళ్లు శాలరీలు అడుగుతున్నారు. Samantha {#}Yevaru;Samantha;Audience;Amazon;Cinema;November;Houseఒక్క ప్రాజెక్టుకే అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సమంత.. రికార్డు బద్దలు!!ఒక్క ప్రాజెక్టుకే అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సమంత.. రికార్డు బద్దలు!!Samantha {#}Yevaru;Samantha;Audience;Amazon;Cinema;November;HouseWed, 07 Aug 2024 11:43:00 GMTఇటీవల కాలంలో హీరోయిన్లు రెమ్యునరేషన్ విషయంలో హీరోలతో పోటీ పడుతున్నారనే మాట వాస్తవం. ఒక్క పెద్ద హిట్ వస్తే చాలు కొత్త హీరోయిన్లు కూడా కోటి రూపాయల కంటే ఎక్కువ పారితోషికం అడుగుతున్నారు. రెండో హిట్ వస్తే చాలు రూ.3-రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు  ఈరోజుల్లో ఎవరు ఎంత కాలం ఉంటారో చెప్పలేని పరిస్థితి అందుకే దీపం వెలిగినప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఒక ఆలోచనతో వీళ్లు శాలరీలు అడుగుతున్నారు.ఇక సమంత రూత్ ప్రభు సింగిల్ సాంగ్‌కే రూ.5 కోట్లు ఛార్జ్ చేసి షాక్ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలోనే తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేసి అగ్రతారగా ఎదిగింది. సాలిడ్ స్క్రిప్ట్ ఎంపికలతో నేషనల్ వైడ్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్, హైయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్‌గా అవతరించింది. సమంత ఇప్పుడు పారితోషికం విషయంలో మరో రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది.

అది ఏంటంటే ఈ ముద్దుగుమ్మ సింగిల్ ప్రాజెక్టుకు రూ.10 కోట్లు తీసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ వెబ్‌సిరీస్ 'సిటాడెల్-హనీ బన్నీ'లో నటించేందుకు ఆమె రూ.10 కోట్లు రెమ్యునరేషన్‌గా  తీసుకున్నట్లు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. సమంత తప్ప ఇప్పటివరకు ఎవరూ కూడా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్‌ అందుకోలేదని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీడియం రేంజ్ హీరోలు కూడా అంత అమౌంట్ తీసుకునే లెవల్ కి వెళ్ళలేదు కానీ సమంత హీరోలకు దీటుగా అంత మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సమంత "ది ఫ్యామిలీ మ్యాన్" సీజన్ 2 లో విలన్ పాత్ర చేసి చాలా పేరు తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో ఆమె నటన చూసి ప్రేక్షకులు చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు నుంచి ఆమెకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. దీని తర్వాతనే ఆమెకు "సిటాడెల్" అనే వెబ్ సిరీస్ కోసం 10 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఈ సిరీస్ టీజర్ చూసిన ప్రేక్షకులు ఆమె అందం, యాక్షన్ సీన్స్ చూసి ముగ్ధులయ్యారు.

సమంత తన కెరీర్ మొదట్లోనే చాలా పేరు సంపాదించుకుంది. "సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు", "రంగస్థలం" లాంటి సినిమాల తర్వాత ఆమె రెమ్యునరేషన్ చాలా పెరిగింది. ఇప్పుడు ఆమె OTT ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదించే నటి. నవంబర్ 7న "సిటాడెల్" రిలీజ్ కాబోతుంది. ఆమె కెరీర్‌లో ఇది మరో మైలురాయి అని అభిమానులు భావిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>