Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithcb39d40b-186a-45dc-b188-d5bbd19ae2ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithcb39d40b-186a-45dc-b188-d5bbd19ae2ce-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ క్రికెటర్లలో ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి టీమిండియా కు ప్రాతినిధ్య వహిస్తున్న రోహిత్ శర్మ తన ఆట తీరుతో కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక ఎప్పుడు ఓపెనర్ గా బరిలోకి దిగుతూ టీమ్ ఇండియాకు మంచి ఆరంభాలు అందించే రోహిత్ శర్మ.. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడు అంటే సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. అందుకే వరలRohith{#}Maha;ICC T20;Rohit Sharma;INTERNATIONALఆ విషయంలో సచిన్ ను దాటేసిన రోహిత్.. ఇండియన్ క్రికెట్ లో ఒకే ఒక్కడు?ఆ విషయంలో సచిన్ ను దాటేసిన రోహిత్.. ఇండియన్ క్రికెట్ లో ఒకే ఒక్కడు?Rohith{#}Maha;ICC T20;Rohit Sharma;INTERNATIONALWed, 07 Aug 2024 13:15:00 GMTవరల్డ్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ క్రికెటర్లలో ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి టీమిండియా కు ప్రాతినిధ్య వహిస్తున్న రోహిత్ శర్మ తన ఆట తీరుతో కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక ఎప్పుడు ఓపెనర్ గా బరిలోకి దిగుతూ టీమ్ ఇండియాకు మంచి ఆరంభాలు అందించే రోహిత్ శర్మ.. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడు అంటే సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు.


అందుకే వరల్డ్ క్రికెట్లో ఉన్న మహా మహా బౌలర్లు సైతం రోహిత్ శర్మకు బంతులు వేయాలంటే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అతను బాదే బాదుడుకు ఎక్కడ తమ ఖాతాలో చెత్త రికార్డులు చేరిపోతాయో అనే భయపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా వీరబాదుతూ ఇప్పటివరకు ఎన్నో అరుదైన రికార్డులను కూడా రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం రోహిత్ కేప్టెన్సీలో టీమిండియా శ్రీలంకతో వన్డే సిరీస్ లో బరిలోకి దిగగా.. ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి. అయితే మిగతా ఆటగాళ్లు నిరాశ పరుస్తున్న రోహిత్ మాత్రం వరుసగా రెండు మ్యాచ్లలో కూడా మెరుపు హాఫ్ సెంచరీలు చేశాడు.


 వన్డే ఫార్మాట్లో కూడా t20 తరహ ఇంటెన్స్ తో బ్యాటింగ్ చేస్తూ అదరగొట్టేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల రోహిత్ సాధించిన ఒక అరుదైన రికార్డు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో 50 ప్లస్ స్కోర్లు ఎక్కువసార్లు చేసిన భారత ఓపెనర్ గా రికార్డును సృష్టించాడు రోహిత్  సచిన్ (120)పేరిట ఉన్న రికార్డును రోహిత్ ( 121 )బ్రేక్ చేశాడు. అలాగే వన్డే ఫార్మాట్లో తొలి 10 ఓవర్లలోపు అత్యధిక ఫిఫ్టీలు కొట్టిన భారత బ్యాట్స్మెన్ ల లిస్టులోనూ రోహిత్ (4) రెండవ స్థానంలో ఉండగా.. సెహ్వాగ్ (7) తొలి స్థానంలో ఉన్నాడు. కాగా మొదటి మ్యాచ్ టైగా ముగియగా రెండో మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయింది. నేడు జరగబోయే మూడో మ్యాచ్లో టీమిండియా ఎలా రానిచబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>