PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brs-bjped9ad82a-6c29-4d8b-9ebc-c2d6379fc3be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brs-bjped9ad82a-6c29-4d8b-9ebc-c2d6379fc3be-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 10 ఏళ్లపాటు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. 2023లో అధికారం కోల్పోయారు. అప్పటినుంచి బీఆర్ఎస్ పార్టీ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పార్టీ చూస్తుంటే పతనమైనట్లుగా తెలుస్తోంది. ఎవరూ కూడా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని విశ్వసించడం లేదు. కీలకమైన పార్టీ నేతలు అందరూ హస్తం పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ త్వరలో బీజేపీలో విలీనం కాబోతోందని ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ ఆర్టీవీ రవి ప్రకాష్ సంచలన ఆరోపణ చేశారు. టీవీ లైవ్ ద్వారBRS BJP{#}Ravi Prakaash;Narendra Modi;Prime Minister;KCR;kavitha;Telugu;television;MP;Government;Bharatiya Janata Party;Delhi;Congress;Partyఆర్టీవీ సెన్సేషనల్ రిపోర్ట్.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం??ఆర్టీవీ సెన్సేషనల్ రిపోర్ట్.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం??BRS BJP{#}Ravi Prakaash;Narendra Modi;Prime Minister;KCR;kavitha;Telugu;television;MP;Government;Bharatiya Janata Party;Delhi;Congress;PartyWed, 07 Aug 2024 12:13:00 GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 10 ఏళ్లపాటు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. 2023లో అధికారం కోల్పోయారు. అప్పటినుంచి బీఆర్ఎస్ పార్టీ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పార్టీ చూస్తుంటే పతనమైనట్లుగా తెలుస్తోంది. ఎవరూ కూడా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని విశ్వసించడం లేదు. కీలకమైన పార్టీ నేతలు అందరూ హస్తం పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ త్వరలో బీజేపీలో విలీనం కాబోతోందని ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ ఆర్టీవీ రవి ప్రకాష్ సంచలన ఆరోపణ చేశారు. టీవీ లైవ్ ద్వారా ఈ విషయాన్ని నివేదించారు.

టీఆర్‌ఎస్‌గా పేరుగాంచిన బీఆర్‌ఎస్ త్వరలో చరిత్రలో నిలిచిపోతుందని, మరికొద్ది రోజుల్లో బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం కానుందని, ఇకపై తెలంగాణలో కేసీఆర్ పార్టీ స్వతంత్రం కాదని రవిప్రకాశ్ అన్నారు. కవిత అరెస్ట్ అయినప్పటి నుండి BRS-BJP సంకీర్ణం గురించి పుకార్లు వచ్చాయి, వాటిని ఎవరూ నమ్మలేదు కానీ. విలీనంపై రవి ప్రకాష్ చేసిన కామెంట్స్ కి మాత్రం అలా ఇంపార్టెన్స్ లభిస్తోంది. అది నిజమైన ఏమో అని చాలామంది నమ్ముతున్నారు కూడా.

బీఆర్‌ఎస్‌ బీజేపీ విలీనం అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, రవి ప్రకాష్ చాలా కాన్ఫిడెంట్‌గా ఈ మాటలు చెప్పారు, మరికొన్ని రోజుల్లో విలీనం జరుగుతుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ బీజేపీలో విలీనమైతే దక్షిణ భారతదేశంలోనే పెద్ద ఎత్తుగడ అవుతుంది. అయితే బీఆర్‌ఎస్‌తో తెలంగాణలో చేసిన దశాబ్దాల పోరాటాన్ని కేసీఆర్ అంత తేలిగ్గా ముగించేస్తారా? ఢిల్లీ మద్యం కేసు నుంచి కవితకు విముక్తి కల్పించేందుకు ఇదేనా త్యాగమా ? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎంపీ సీట్లు ఈసారి బాగా తగ్గాయి. వచ్చేసారి గెలవాలంటే అందర్నీ కలుపుకో పోవాల్సిందే. అందుకే కేసీఆర్ వస్తే మోడీ కాదనే అవకాశం ఉండకపోవచ్చు. చివరికి ఏమవుతుందనేది తెలియాలంటే కనీసం మూడు నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>