PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-ysrcp-vishaka-mlc-bostha-satya-narayana79ea8a81-d697-46c1-b212-212bdbbf6ae3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-ysrcp-vishaka-mlc-bostha-satya-narayana79ea8a81-d697-46c1-b212-212bdbbf6ae3-415x250-IndiaHerald.jpg- రెండు నెల‌ల్లోనే మ‌రో ఎన్నిక కు రెడీ అవుతోన్న బొత్స స‌త్తి బాబు - వైసీపీ కి ఫుల్ మెజార్టీ ఉన్నా గెలుపు పై డౌట్లే.. ? ( ఉత్త‌రాంధ్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ ) . ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికల ముగిసి రెండు నెలలు కూడా కాకుండానే మరో ఎన్నిక వచ్చేసింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈరోజు నుంచి ఎన్నికల ప్రక్రియ కూడా మొదలు కానుంది. వైసీపీ నుంచి మాజీ మంత్రి .. ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలో ఉండబోతున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పలుకుబడి ఉYS.JAGAN;YSRCP;VISHAKA MLC;BOSTHA SATYA NARAYANA{#}BOTCHA SATYANARAYANA;Vishakapatnam;Uttarandhra;Elections;Janasena;Yevaru;local language;TDP;India;Party;YCP;Jagan;Ministerరెండు నెల‌ల్లోనే జ‌గ‌న్ మ‌ళ్లీ ఓడిపోతున్నాడా ..?రెండు నెల‌ల్లోనే జ‌గ‌న్ మ‌ళ్లీ ఓడిపోతున్నాడా ..?YS.JAGAN;YSRCP;VISHAKA MLC;BOSTHA SATYA NARAYANA{#}BOTCHA SATYANARAYANA;Vishakapatnam;Uttarandhra;Elections;Janasena;Yevaru;local language;TDP;India;Party;YCP;Jagan;MinisterWed, 07 Aug 2024 09:57:16 GMT- రెండు నెల‌ల్లోనే మ‌రో ఎన్నిక కు రెడీ అవుతోన్న బొత్స స‌త్తి బాబు
- వైసీపీ కి ఫుల్ మెజార్టీ ఉన్నా గెలుపు పై డౌట్లే.. ?

( ఉత్త‌రాంధ్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ ) .

ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికల ముగిసి రెండు నెలలు కూడా కాకుండానే మరో ఎన్నిక వచ్చేసింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈరోజు నుంచి ఎన్నికల ప్రక్రియ కూడా మొదలు కానుంది. వైసీపీ నుంచి మాజీ మంత్రి .. ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలో ఉండబోతున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పలుకుబడి ఉన్న నేతగా పేరు ఉన్న బొత్స ను జగన్ తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఇక కూటమి నుంచి ఎవరు ? పోటీచేస్తారు అన్నది ఫైనల్ కావాల్సి ఉంది. వాస్తవంగా చూస్తే స్థానిక సంస్థల్లో మెజార్టీ బలం వైసీపీకే ఉంది . విశాఖపట్నం జిల్లాలో దాదాపు 500 స్థానిక సంస్థ‌ల‌ స్థానాలు వైసిపి చేతుల్లో ఉంటే కూటమికి కేవలం 200 స్థానాలు మాత్రమే ఉన్నాయి.


ఈ లెక్క‌న చూస్తే వైసీపీ అభ్య‌ర్థి బొత్స భారీ మెజార్టీ తో ఘ‌న విజ‌యం సాధించాలి. అయితే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వైసిపి కి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున టిడిపి - జనసేన లో చేరిపోయారు. ఎంపీటీసీలు .. జడ్పిటిసిలు భారీ ఎత్తున టిడిపి - జనసేన లో చేరడంతో కూటమి విజయం తప్పదు అన్న చర్చలు జరుగుతున్నాయి. వాస్తవంగా ఎంతో బలం ఉండి కూడా పైగా బొత్స లాంటి సీనియర్ నేతను పోటీలో పెట్టిన కూడా ఇక్కడ వైసిపిని గెలిపించుకో లేకపోతే అది స్వయంగా జగన్ ఓడిపోయినట్టు అవుతుంది. జగన్ ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు .. మరి ఇక్కడ జగన్ గెలుస్తాడా ఓడిపోతాడా అన్నది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>