Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef8942a50-02ce-4fc1-8b7a-e525ca8bb59a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef8942a50-02ce-4fc1-8b7a-e525ca8bb59a-415x250-IndiaHerald.jpgబాలయ్య కు సినిమాల పరంగానూ, వ్యక్తిగతంగానూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన చేసే పాత్రలు లార్జర్ దేన్ లైఫ్ ఉంటాయి. ఎక్కువ శాతం సీరియస్ గా సాగుతూంటాయి. పూర్తి యాక్షన్ ఇమేజ్ తో సాగే ఆ పాత్రలు ఆయన కోసమే డిజైన్ చేస్తారు. వేరే వాళ్లు కనుక ఆ పాత్ర చేస్తే నవ్వులు పాలు అవుతారు. ఆయన వందశాతం ఆ ఎమోషన్స్ కు సెట్ అయ్యిపోతూంటారు. అందుకే కామెడీ సినిమాలు ఆయన కెరీర్ లో చేసినవి అతి తక్కువ. అప్పెడెప్పుడో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన బాబాయ్ - అబ్బాయ్, ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన గొప్పింటి అల్లుడుsocialstars lifestyle{#}boyapati srinu;Remake;Gaddalakonda Ganesh;college;Jandhyala Ravishankar;Hindi;Gabbar Singh;harish shankar;Bobby;Balakrishna;Comedy;shankar;Cinema;media;Newsఅలాంటి సినిమాలు చేయొద్దంటూ బాలయ్య ను వేడుకుంటున్న ఫ్యాన్స్..?అలాంటి సినిమాలు చేయొద్దంటూ బాలయ్య ను వేడుకుంటున్న ఫ్యాన్స్..?socialstars lifestyle{#}boyapati srinu;Remake;Gaddalakonda Ganesh;college;Jandhyala Ravishankar;Hindi;Gabbar Singh;harish shankar;Bobby;Balakrishna;Comedy;shankar;Cinema;media;NewsWed, 07 Aug 2024 14:30:00 GMTబాలయ్య కు సినిమాల పరంగానూ, వ్యక్తిగతంగానూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన చేసే పాత్రలు లార్జర్ దేన్ లైఫ్ ఉంటాయి. ఎక్కువ శాతం సీరియస్ గా సాగుతూంటాయి. పూర్తి యాక్షన్ ఇమేజ్ తో సాగే ఆ పాత్రలు ఆయన కోసమే డిజైన్ చేస్తారు. వేరే వాళ్లు కనుక ఆ పాత్ర చేస్తే నవ్వులు పాలు అవుతారు. ఆయన వందశాతం ఆ ఎమోషన్స్ కు సెట్ అయ్యిపోతూంటారు. అందుకే కామెడీ సినిమాలు ఆయన కెరీర్ లో చేసినవి అతి తక్కువ. అప్పెడెప్పుడో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన బాబాయ్ - అబ్బాయ్, ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన గొప్పింటి అల్లుడు. అయితే ఇప్పుడు ఫన్ , యాక్షన్,ఎమోషన్ తో వచ్చిన ‘ఆవేశం’రీమేక్ లో ఆయన చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.మలయాళంలో ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ‘ఆవేశం’ సినిమా పెద్ద హిట్ . దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చిందీ ఈ సినిమా. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ రంగ అనే ఓ రౌడీ పాత్రలో పవర్ ఫుల్ క్యారక్టర్ లో కనిపించాడు. కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ కి హెల్ప్ చేసే కథతో యాక్షన్ కామెడీగా ఆవేశం సినిమా తెరకెక్కింది.తెలుగు రీమేక్ రైట్స్ మైత్రీ మూవీస్ వారు తీసుకుని రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు హరీష్ శంకర్ ని డైరక్టర్ గా ఎంచుకున్నారని వార్త.హరీష్ శంకర్ ...రీమేక్స్ చేయటంలో సిద్దహస్తుడు. ఒరిజనల్ వాళ్లు కూడా వచ్చి హరీష్ శంకర్ రీమేక్ చేసిన సినిమా రైట్స్ మళ్లీ కొనుక్కుని రీమేక్ చేసుకోవాలనించే స్దాయిలో ఉంటుంది. గబ్బర్ సింగ్ , గద్దల కొండ గణేష్ తో హరీష్ శంకర్ ఆ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హిందీ చిత్రం రైడ్ రీమేక్ మిస్టర్ బచ్చన్ తో మన ముందుకు వస్తున్నాడు. డైలాగ్స్ అయితే మామూలుగా రాయడు. బాలయ్య , హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. అందుకే ఓ వెర్షన్ రాసి బాలయ్యకు వినిపించబోతున్నారట. అంతకు ముందు ఇప్పుడు బాలయ్య సినిమాలపై నిర్ణయాలు తీసుకుంటన్న ఆయన కుమార్తె తేజస్విని వింటారట. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ట లే..ఎందుకంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.

ఈ నేపథ్యంలో బాలయ్య కు సినిమాల పరంగానూ, వ్యక్తిగతంగానూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన చేసే పాత్రలు లార్జర్ దేన్ లైఫ్ ఉంటాయి. ఎక్కువ శాతం సీరియస్ గా సాగుతూంటాయి. పూర్తి యాక్షన్ ఇమేజ్ తో సాగే ఆ పాత్రలు ఆయన కోసమే డిజైన్ చేస్తారు. వేరే వాళ్లు కనుక ఆ పాత్ర చేస్తే నవ్వులు పాలు అవుతారు. ఆయన వందశాతం ఆ ఎమోషన్స్ కు సెట్ అయ్యిపోతూంటారు. అందుకే కామెడీ సినిమాలు ఆయన కెరీర్ లో చేసినవి అతి తక్కువ. అయితే ఇప్పుడు ఫన్ , యాక్షన్,ఎమోషన్ తో వచ్చిన 'ఆవేశం'రీమేక్ లో ఆయన చేయబోతున్నాడనే వార్తలు అభిమానుల్లో కొందరిని కంగారు పెడుతున్నాయి.ఆవేశం కథ బాలకృష్ణ ఇమేజ్‌కు ఈ కథ సూటవ్వదని, బాలయ్య ఇమేజ్‌, ఫహద్ ఫాజల్ ఇమేజ్ రెండూ వేర్వేరని, ఇద్దరికీ మ్యాచ్ అయ్యే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇవన్నీ గుర్తు చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా రిక్వెస్టులు చేస్తున్నారు. అయినా ఓటిటిలు వచ్చాక ఆల్రెడీ ఆ సినిమాలను జనం చూసేసి ఉంటున్నారు కాబట్టి, పెద్దగా ఉపయోగపడదని వాదిస్తున్నారు.మరో ప్రక్క ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నిజానికి బాలయ్య రీమేక్ చేయడానికి ఏమాత్రం సముఖంగా లేడని తెలుస్తోంది. ఈ సినిమా అనే కాదు, అసలు రీమేకే చేయకూడదని బాలయ్య నిర్ణయం తీసుకొన్నాడని చెప్తున్నారు. అయితే ఆవేశం సినిమా మాత్రం బాలయ్యకు నచ్చిందిట. హరీష్ శంకర్ డైరక్టర్ గా ఓ వెర్షన్ వినిస్తాడంటున్నారు. హరీష్ శంకర్ పూర్తి మార్పులతో బాలయ్య ఇమేజ్ కు తగ్గట్లు చేస్తే చేయచ్చేమో....అప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ బెంగలేం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.అయితే ఆ పాత్ర ఎంట్రీతోనే కథలో అసలు జోష్‌ మొదలవుతుంది. ఆ పాత్ర గెటప్, లుక్, విభిన్నంగా ఉంటుంది. డైలాగులు చెప్తూంటే థియేటర్స్ దద్దరిల్లాయి. కాబట్టే హరీష్ శంకర్ డైలాగులు రాస్తే బాలయ్య ఆ పాత్రలోకి వస్తే మామూలుగా ఉండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆ తరువాత బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక.. హరీష్ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశముంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>